ఏపీ ట్రాన్స్ కోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు 2018 రివైజ్డ్ పే స్కేళ్ల ప్రకారం వేతనాలు సవరిస్తూ సీఎం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా ట్రాన్సుకోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సవరించినట్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైస్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులకు వేతనాలను పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: Mahindra OJA: నాలుగు చక్రాలతో నడిచే తేలికపాటి ట్రాక్టర్లను ఆవిష్కరించిన మహీంద్రా గ్రూప్
హైస్కిల్డ్ కార్మికులకు రూ.22,589 నుంచి రూ. 30,605కు, స్కిల్డ్ కార్మికులకు రూ.20,598 నుంచి రూ. 27,953 కు పెంచుతున్నట్లు ప్రకటించగా.. సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.17,144 నుంచి రూ.23,236కు, అన్ స్కిల్డ్ కార్మికులకు రూ. 16,473 నుంచి రూ.22,318కి పెంచారు. ఈ నెల 9వ తేదీన సబ్ కమిటీతో జరిగిన చర్చల్లో 2018 పేస్కేళ్ల ప్రకారం 2 శాతం పెంపుదలకు విద్యుత్ ఉద్యోగ సంఘాలు అంగీకరించాయని ఈమేరకు ఉత్తర్వులను ఏపీ ట్రాన్సుకో సీఎండీ కె.విజయానంద్ జారీ చేశారు.
Read Also: Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్!
ఏపీ విద్యుత్ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో విద్యుత్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతంకు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ నేడు (బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి పొందనున్నారు. కాగా, సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఏపీ ట్రాన్స్ కో సీఎండీ విజయానంద్ పేర్కొన్నారు. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది.