బీజేపీ అధిష్టానం ఇటీవల పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీజేపీ అధిష్టానం. అయితే.. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా యూనివర్శిటీల్లో అనేక విషయాలు వస్తున్నాయని, ఎన్డీఏ సమావేశం కోసం టీడీపీకి ఆహ్వానం పంపలేదని ఆయన తెలిపారు. జనసేన మా మిత్రపక్షంగా ఉందని, ఆ పార్టీకి ఆహ్వానం వెళ్లి ఉంటుందని భావిస్తున్నామన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ విషయంలో ఏపీలోని ప్రాంతీయ పార్టీలు వాళ్ల వైఖరి చెప్పాలన్నారు. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఎన్డీఏ పక్షాల సమావేశం జరగనుందని ఆయన అన్నారు.
Also Read : AP BJP Madhav : రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు
కూటమి పేరుతో ప్రతిపక్షాలు రకరకాల సమావేశాలు నిర్వహించిందని, పురంధేశ్వరీ బాధ్యతలు తీసుకున్న వెంటనే పవన్ అభినందించారన్నారు. జనసేనతో కలిసి ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో మేమూ.. జనసేన కలిసి ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం చేయాలని భావిస్తున్నామన్నారు. గతంలో టీడీపీ మాతో ఉండేది.. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఎన్డీఏ కూటమిలో లేదని, ప్రస్తుతం మా పొత్తు జనసేనతోనేనన్నారు. టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తే.. అప్పుడు రాష్ట్ర పార్టీగా మా అభిప్రాయాలు చెబుతామన్నారు.
Also Read : Raw Onion Disadvantages: పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి హానికరం.. ఏమవుతుందో తెలుసా?