ఏపీలో ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిలో టమాట రూ. 150కి అమ్ముతున్నారని, నూజివీడు మామిడి ధర కంటే టమాట ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. టమాటనే కాదు.. నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలే తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. కిసాన్ రైలు ద్వారా ధరలను నియంత్రించొచ్చు.. కానీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలే తీసుకోవడం లేదని ఆయన అన్నారు. వినిధ పంటలకు మద్దతు ధర కల్పించే అంశంలోనూ మంత్రులు విఫలమయ్యారన్నారు.
Also Read : ODI World Cup 2023: ప్రపంచకప్ 2023కి శ్రీలంక, నెదర్లాండ్స్ అర్హత.. భారత్ లేటెస్ట్ షెడ్యూల్ ఇదే!
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యల్లేవని ఆయన అన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో నష్టపరిహరం ఇచ్చి జగన్ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. మేం వైసీపీపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రధానిని సీఎం జగన్ కలిస్తే మేం బీజేపీకి దగ్గరగా ఉన్నామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వ అవినీతిని ప్రధాని తప్పు పట్టారని ఆయన తెలిపారు. పొత్తుల విషయం తమ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని మాధవ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పొత్తుల మీద అనేక రకాలుగా ప్రచారం జరుగుతుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
Also Read : Bandi Sanjay: కరీంనగర్ చేరుకున్న బండి సంజయ్.. బోరున ఏడ్చినకార్యకర్తలు