తెలంగాణ రాష్ట్రంలో లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని, ఈ డబ్బంతా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు వెళ్లిందని మాజీ ఎంపీ ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాలేశ్వరం ఏటీఎం సెంటర్ అంటూ వినూత్న పద్ధతిలో ఏటీఎం సెంటర్ ఏర్పాటుచేసి నిరసన వ్యక్తం చేశారు. ఏటీఎం సెంటర్ ను ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ లు హాజరై ప్రారంభించారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు , యువకులు , నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక దశాబ్ది కాలంగా జరిగిన పెద్ద స్కాం కాలేశ్వరం ప్రాజెక్టు అని ఆయన ఆరోపించారు.
Also Read : Mamata Banerjee: ఎన్నికల ముందే ప్రతిపక్ష నేతల అరెస్టుకు బీజేపీ కుట్ర..
సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి , కుంభకోణాలు , అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బిఆర్ఎస్ , బిజెపి , ఎంఐఎంలు ఒక్కటేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాకుండా మద్యం షాపులు , బెల్టుషాపుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. దేశ ప్రధాని , సీఎం కేసీఆర్ ఒక్కటేనని ఇద్దరు కలిసి దేశాన్ని , రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు గుణపాఠం చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
Also Read : Neha Shetty : చీర కట్టులో నేహా శెట్టి పరువాల విందు మాములుగా లేదుగా..