బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.దాదాపు రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకొని యానిమల్ మూవీ భారీ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గత డిసెంబర్ 1న వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది.. ఈ క్రమంలో యానిమల్ సక్సెస్ పార్టీ.. ముంబైలో శనివారం (జనవరి 6) ఎంతో గ్రాండ్‍గా జరిగింది. ఈ సెలెబ్రేషన్లకు యానిమల్ మూవీ టీమ్‍తో పాటు బాలీవుడ్ స్టార్లు చాలా మంది హాజరయ్యారు.రణ్‍బీర్ కపూర్, ఆలియా భట్, మహేశ్ భట్, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్, రితేశ్ దేశ్‍ముఖ్, ఆయుష్మాన్ ఖురానా, జెనీలియా మరియు కార్తిక్ ఆర్యన్ సహా చాలా మంది బాలీవుడ్ నటీనటులు మరియు టెక్నిషియన్లు యానిమల్ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు. యానిమల్ టీమ్ ఎంతో గ్రాండ్‍గా సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకుంది.
యానిమల్ సినిమాలో నటించిన రణ్‍బీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరియు నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా సహా మరికొందరు కెమెరాలకు గ్రూప్‍గా పోజులు ఇచ్చారు. సైలెన్స్ అంటూ నోటిపై వేలు వేసుకొని వున్న పోజ్ ను ఇచ్చారు.. అయితే, యానిమల్ చిత్రాన్ని విమర్శిస్తున్న వారికి సమాధానంగానే ఇలా సైలెన్స్ అంటూ సెలెబ్రేషన్ సిగ్నేచర్ ఇచ్చారా అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.హీరోయిన్ రష్మిక మందన్నబ్లాక్ ఔట్‍ఫిట్ లో యానిమల్ సక్సెస్ పార్టీ కు వచ్చారు.రణ్‍బీర్ కపూర్ రష్మికను హగ్ చేసుకొని కిస్ ఇస్తూ పార్టీకి వెల్‍కమ్ చెప్పారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అలాగే యానిమల్‍లో విలన్ పాత్ర చేసిన బాబీ డియోల్.. ఈ పార్టీకి షర్ట్ లేకుండా బ్లేజర్ మాత్రమే వేసుకొని వచ్చారు. రణ్‍బీర్ కపూర్ కూడా బ్లాక్ ఔట్‍ఫిట్‍లో మరింత హ్యాండ్‍సమ్ లుక్ లో కనిపించారు.స్టార్ హీరోయిన్ ఆలియా భట్ బ్లూకలర్ డ్రెస్‍లో మెరిసింది.యానిమల్ సినిమాతో ఊహించని స్టార్డమ్ అందుకున్న త్రిప్తి డిమ్రి.. కూడా బ్లాక్ కలర్ డ్రెస్‍లోకనిపించి అదరగొట్టింది.అలాగే స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా హాట్‍లుక్ లో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది..
https://twitter.com/sdn7_/status/1743929105874358595