ఇది బ్రో మాకు కావాల్సింది… ఇది బ్రో అసలైన మాస్ ఫీస్ట్ అంటే… మొత్తంగా అదిరింది బ్రో… అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది బ్రో మూవీ టీజర్. సముద్రఖని దర్శకత్వంలో పవన్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఫాంటసీ మూవీ బ్రో. జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో టీజర్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్‌ను ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో, ఆ రేంజ్ ఎలివేషన్స్‌తో అదిరిపోయింది బ్రో టీజర్. స్టైలిష్ గాడ్‌గా ఉన్న పవర్ స్టార్‌ను చూసి పండగ చేసుకుంటున్నారు. పవన్ స్వాగ్, తమ్ముడు సినిమా గెటప్, పవర్ స్టార్ డైలాగ్ డెలివరీ, మామ అల్లుళ్ల కాంబో, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బ్రో ఎలివేషన్ మామూలుగా లేదు.
దాంతో మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది బ్రో టీజర్. అలా రిలీజ్ అయిందో లేదో.. వెంటనే 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక 12 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ రాబట్టింది అంటే 12 గంటల్లోనే బ్రో మూవీ టీజర్‌ను కోటి మంది చూసేశారన్నమాట. దీంతో 24 గంటల్లో ‘బ్రో ‘ టీజర్ రికార్డ్ రేంజ్ వ్యూస్ రాబట్టే ఛాన్స్ ఉంది. మొత్తంగా ప్రస్తుతం బ్రో టీజర్‌కి ఆడియన్స్, పవన్ ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్ నిర్మిస్తున్నారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. మరి థియేటర్లో బ్రో ఎలా రచ్చ చేస్తాడో చూడాలి.