Tragedy: మేం చనిపోవడానికి కారణం ఆ నలుగురే. వారిని వదిలిపెట్టొద్దు’ అంటూ సూసైడ్ నోట్ రాసి నాలుగేళ్ల కుమార్తెతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా లక్ష్మీపురానికి చెందిన కొప్పుల సాయికృష్ణ(37), చిత్రకళ(30) దంపతులు. వీరికి తేజస్వి అనే నాలుగేళ్ల కూతురు ఉంది. ఏడాది నుంచి ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. సాయికృష్ణ ర్యాపిడో బైక్‌పై వెళ్లేవాడు. ఏడాదిగా పనికి వెళ్లడం లేదు. భార్య చిత్రకళ నాంపల్లి బిర్లా సైన్స్ సెంటర్‌లోని టికెట్ కౌంటర్‌లో పనిచేసేది. అయితే అపాయింట్‌మెంట్ ఆర్డర్, పే స్లిప్‌లు అడగడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. భర్తకు పని లేకపోవడం, అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేక చిత్రకళ తీవ్ర మనోవేదనకు గురైంది. సరైన కారణాలు చూపకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించిన నలుగురు ఉద్యోగులు శ్యామ్ కోటరీ, గాథా, హరిబాబు, సంతోష్ రెడ్డిలను వదిలిపెట్టవద్దని సూసైడ్ నోట్ రాసి గోడకు అతికించింది. ముందుగా కూతురు ఉరివేసుకుని.. ఆ తర్వాత భార్య, భర్తలు కూడా ఉరివేసుకుని దారుణ హత్యకు పాల్పడ్డారు. గురువారం రాత్రి వీరి ఇంట్లో నుంచి పెద్ద శబ్ధం రావడంతో ఇరుగుపొరుగు వారు తలుపు తట్టారు. కానీ తలుపులు తీయలేదు. ఎంతకు డోర్ తీయకపోవడంతో.. అనుమానం వచ్చిన ఇంటి యజమాని శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ముగ్గురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు.
బిర్లా సైన్స్ సెంటర్‌లో అనేక అవకతవకలు జరిగాయని, వాటి గురించి తనకు తెలిసి శ్యామ్ కొఠారి, గీతారావు, హరిబాబు, సంతోష్ రెడ్డిలపై తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగం నుంచి తొలగించారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. రూ.కోటి మోసం చేశారని 12 పాయింట్లతో సూసైడ్ నోట్ రాసి గోడకు అతికించారు. ఓ.. మంత్రితో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అంతే కాకుండా ఓ.. టీవీ ఛానల్ వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది కానీ స్పందించలేదని తెలిపారు. అయితే ఆఫీస్‌లో ఏం జరిగివుంటే.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Miss Universe 2023: మిస్ యూనివర్స్ పోటీలు.. నేషనల్ కాస్ట్యూమ్స్ డేలో ఆకట్టుకున్న శ్వేతా శార్దా