AP Fiber Net: ఫైబర్ గ్రిడ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చిందన్నారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి.. ఫైబర్ గ్రిడ్‌లో నూతన విధానంతో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం అందించడం ప్రధాన ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. గ్రామ స్ధాయిలో సైతం ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సేవలకు విఘాతం కలగకుండా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 900 సబ్ స్టేషన్లలో రాష్ట్ర వ్యాప్తంగా APSFL షల్టర్లు ఏర్పాటు చేస్తామని.. ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.. ఇక, ఎంఎస్‌వోలకు అధిక లాభం చేకూరేలా చేస్తున్నాం.. ఇప్పటికే ఎంఎస్‌వోలు, డిస్ట్రిబ్యూషన్‌లతో సమావేశం నిర్వహించినట్టు వెల్లడించారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి.
Read Also: Upendra: దళితులపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన ఉపేంద్ర
మరోవైపు.. కొత్త సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే కూర్చొని చూసే ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ప్రారంభించిన విషయం విదితమే.. సినిమా నిర్మాతకు, ప్రేక్షకుడికి లాభం కలిగేలా అతి తక్కువ ధరకే తొలిరోజే సినిమాను రాష్ట్ర ప్రజలు ఇంట్లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని గతంలో గౌతంరెడ్డి వెల్లడించిన విషయం విదితమే.. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమాగా నిరీక్షణ అనే చిత్రాన్ని రూ.99కి విడుదల చేశారు.. ఇక, రెండో సినిమాగా లవ్ యూ టూ చిత్రాన్ని కేవలం రూ.39కే ఏపీఎస్ఎఫ్‌ఎల్ వేదికగా స్ట్రీమింగ్ చేశారు.. అంతే కాదు… రాబోయే రోజుల్లో థియేటర్లలోకి వచ్చే ప్రతి సినిమాను ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా చూసే ఛాన్స్ కల్పిస్తామని.. త్వరలో మూరుమూల ప్రాంతాలకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు విస్తరించనున్నట్టు.. ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతంరెడ్డి ప్రకటించిన విషయం విదితమే.