Kannada actor Upendra approaches Karnataka High Court: దళితులపై కన్నడ నాట స్టార్ హీరో ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. దళితులపై ఆయన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో కేసులు కూడా పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి. అయితే ఉపేంద్రను అరెస్ట్ చేయవద్దు అని కోర్టు నుంచి తీర్పు వచ్చినా ఆయన చేసిన వ్యాఖ్యలకు స్వయంగా క్షమాపణలు కోరినా కూడా దళితులు ఆయన్ని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న క్రమంలో అరెస్టు భయంతో పాటు దాడులు జరుగుతాయన్న అనుమానంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఉప్పి. ఇప్పటికే అరెస్ట్ చేయవద్దని కోర్టులో స్టే తెచ్చుకున్న ఆయన ఇప్పుడు అజ్ఞాతం వీడి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసి అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని కోరినట్టు చెబుతున్నారు.
Singer Mangli : హద్దులు చెరిపేస్తున్న సింగర్ మంగ్లీ… షర్ట్ ముడేసి గుండెలు పిండేస్తోంది!
కర్నాటకలో ప్రజాకీయ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన ఉపేంద్ర పార్టీ మొదలుపెట్టి ఆరేళ్లు అయిన సందర్భంగా ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానులతో ఆయన మాట్లాడారు. ఊరన్న తర్వాత మంచి, చెడు కూడా ఉంటాయని, మంచికే పెద్దపీట వేసి చెడును తొలగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిస్తూ ఓ కన్నడ సామెతను ఉటంకించారు. అయితే ఆ సామెత దళితులను కించపరిచే విధంగా ఉండటంతో పెను వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో చాలా మంది కోపంగా ఉన్నారన్న విషయం తెలిసి ఉపేంద్ర మళ్లీ ఫేస్‌బుక్‌లోకి వచ్చి తన ప్రకటనకు క్షమాపణలు చెప్పి “అనుకోకుండా” ఆ వ్యాఖ్యలను చేశానని క్షమాపణలు కోరుతున్నాను” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అయినా ఆందోళనలు ఆగడం లేదు దీంతో సదాశివనగర, కత్రిగుపెట్టలో ఉపేంద్ర నివాసాలకు పోలీసులు భద్రత కల్పించారు. ఇక హైకోర్టులో ఉపేంద్ర దాఖలు చేసిన పిటిషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది.