Anand Mahindra: రాజకీయాల్లోకి సినిమా హీరోలు, హీరోయిన్లు, ప్రజల్లో గుర్తింపు ఉన్న వారందరు రాజకీయాల్లోకి వచ్చారు. క్రీడాకారులు కూడా కొంతమంది రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇటు సినిమా హీరోలు గానీ.. అటు క్రీడాకారులు గానీ వారంతట వారు రాజకీయాల్లోకి వస్తేనే యాక్టివ్‌గా ఉంటున్నారు. అలా కాకుండా రాజకీయ పార్టీలు వాటంతట అవే సినిమా హీరోలకు, క్రీడాకారులకు నామినేటెడ్ పదవులు, రాజ్యసభ ఎంపీలుగా నియమించడం వంటివి చేస్తే వారు అంత యాక్టివ్‌గా ఉండరు. ఇప్పుడు కొత్తగా భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని రాజకీయాల్లోకి రావాలని మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ అధిపతి ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో ఆసక్తికరమైన కామెంట్ చేశారు.
Read Also: Kesineni Nani: బెజవాడలో పొలిటికల్ హీట్.. మరోసారి కేశినేని హాట్ కామెంట్స్..
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ముందు వరుసలో ఉన్నాడు.. ఐపీఎల్‌లో కూడా ధోనీ కెప్టెన్సీతో ఐదు ట్రోఫీలను అందించాడు. చెన్నై టీమ్‌కు నాయకత్వం వహించిన మిస్టర్ కూల్.. నాయకత్వంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్టర్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చాలా మంది లాగే మహేంద్ర సింగ్ ధోనీ ఇంకో ఏడాది ఐపీఎల్‌లో ఆడితే చూడాలనుకునే వారిలో తానూ కూడా ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే ఎక్కువ కాలం అలా జరగాలని నేను ఆశించడం లేదని ఆనంద్ మహీంద్రా అన్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో ధోనీ రాజకీయాల గురించి కూడా ఆలోచిస్తాడని నేను నమ్ముతున్నాను అని ఆనంద్ మహీంద్రా అన్నారు.
Read Also: Puvvada Ajay Kumar: ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలుస్తాం…
ఎన్‌సీసీ సమీక్ష ప్యానెల్‌లో మహీతో కలిసి తాను పనిచేశానని.. క్రీడా మైదానంలో అతని చురుకుదనాన్ని, మేధస్సుని దగ్గర నుంచి చూశానన్నాడు. క్రీడారంగంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. ఇతర విషయాల్లో కూడా ధోనీ అంతే చురుగ్గా వ్యవహరిస్తాడు అని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఇతరులతో సులువుగా కలిసిపోయే మనస్తత్వం ధోనిది. వినూత్నంగా ఆలోచిస్తాడు. దృఢంగా ఉంటాడు. ఖచ్చితంగా అతను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Like most people, I was pleased to hear that #MSDhoni might stay on for another year in the #IPL. But I would not hope for longer, since I believe he needs to consider rhe political arena. I worked with him on the NCC review panel chaired by @PandaJay & saw that his intellectual… https://t.co/4uuhWIGFAt
— anand mahindra (@anandmahindra) May 30, 2023