Puvvada Ajay Kumar: ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలుస్తాం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puvvada Ajay Kumar: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 10 బీఆర్‌స్సే గెలుస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చేయకుండా కలిసి పనిచేసి జిల్లాలో బీఆర్‌ఎస్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రారంభించిన అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పూర్తి చేసుకున్నామని.. ప్రాజెక్టు నుంచి సాగునీరు సైతం రైతులకు అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
Read Also: BJP: రాహుల్ గాంధీలోకి “జిన్నా” ఆత్మ ప్రవేశిస్తుంది.. అమెరికా ప్రసంగంపై బీజేపీ విమర్శలు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
సీతారామ ప్రాజెక్టు కట్టడానికి కాంగ్రెస్ వాళ్లు కేసులు పెట్టి అడ్డు పడుతున్నారని విమర్శించారు. కొంత మందికి ఈ ప్రాజెక్టు కట్టడం కడుపునొప్పిగా ఉందని .. అందుకే అడ్డుకుంటున్నారని మంత్రి అన్నారు. అధికారం ఉన్నంత కాలం డబ్బులు, అధికారం అనుభవించి ఇప్పుడు కేసీఆర్‌ను తిడుతున్నారని మండిపడ్డారు. 10కి 10 గెలుస్తామని చెబుతున్నారు.. మీరు ఆయన జేబులో ఏమైనా ఉన్నారా? అని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. తాము అరాచకం చేస్తే మీరు అసలు రోడ్ల మీద తిరగుతారా? అంటూ మంత్రి పువ్వాడ సవాల్ విసిరారు.
రాబోయే రోజులు చాలా ముఖ్యమని.. పార్టీ కోసం పనిచేయాలని.. మూడోసారి తిరిగి అధికారంలోకి రావాలని సూచించారు. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నవ్యక్తి ఓటుకు నోటు కేసులో నిందితుడని మంత్రి పువ్వాడ విమర్శించారు. ఈసారి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు. తనకు వడదెబ్బ తగిలిందని.. అయినా ఏమ్మడి జిల్లాలో ఉన్న 10 సీట్లకు 10 సీట్లను గెలిపించడం కోసం జిల్లా మొత్తం తిరుగతానని మంత్రి అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 150 దాకా పొగొట్టుకున్నానని.. తాను తన కుటుంబం పంచిపెట్టేదే తప్ప దాచిపెట్టుకోవడానికి తీసుకునేది ఏమీ లేదన్నారు. తనపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తారని.. వాటిని నమ్మవద్దని ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!