Bigg Boss Telugu 7: ఛీఛీ.. కంటెంట్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. బిగ్ బాస్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభమయ్యి మూడు రోజులు అవుతుంది. 14 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లో వదిలేసి.. ఈ ఇంటిపై ఓ కన్నేసి ఉంచమని నాగ్ వెళ్ళిపోయాడు. ఇక ముందు నుంచి చెప్పినట్టుగానే ఈసారి బిగ్ బాస్ అంత ఈజీగా ఉండబోయేది లేదని.. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ నిరూపిస్తూనే ఉన్నాడు. ఇక వచ్చిన రోజు నుంచి ప్రతిదానికి టాస్కులు ఇచ్చిగెలుచుకోవాలి అని చెప్పుకొస్తూనే ఉన్నాడు. మొదటి రోజు సోఫాల కోసం.. ఆ తరువాత బెడ్స్ కోసం బిగ్ బాస్ ఏదో ఒక టాస్క్ ఇస్తూనే ఉన్నాడు. అయితే అవన్నీ టాస్క్ లా కాదు టార్చర్ లా ఉంది అని అంటున్నారు ప్రేక్షకులు. ఇక సోఫాల టాస్క్ పక్కన పెడితే.. కంటెస్టెంట్స్ వచ్చిన దగ్గరనుంచి కాఫీ ఇవ్వకుండా బిగ్ బాస్ టార్చర్ పెడుతున్నాడు. సాధారణంగా .. చాలామందికి కాఫీ తాగితేనే కానీ, పనిచేయలేరు. అది వారి బలహీనత. హౌస్ లో వయస్సు అయ్యినవారు కూడా ఉన్నారు.వారికి కాఫీ తాగకపోతే తలనొప్పివస్తుంది. అవన్నీ తెలిసి కూడా బిగ్ బాస్ కాఫీ పౌడర్ ను ఇవ్వకుండా ఆడుకుంటున్నాడు అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Jabardasth Sailekha: సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారిన సాయి.. ?
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ముఖ్యంగా శివాజీ అంతలా ఫైర్ అవ్వడానికి కారణం కూడా అదే. నాలుగు కంటిన్యూస్ గా కాఫీ కావాలని అడుగుతున్నా.. పట్టించుకోకుండా తమ సహనాన్ని పరీక్షిస్తున్నాడు అని కంటెస్టెంట్స్ ఫీల్ అవుతున్నారు. శివాజీ, షకీలా.. శోభా ఇలా అందరు కాఫీ కోసం కాచుకు కూర్చున్నవారే. ఇక కాఫీ పౌడర్ దక్కించుకొనే టాస్క్ కూడా పెట్టకుండా..వారిని రెచ్చగొట్టే విధంగామాట్లాడడం అస్సలు బాగోలేదని అంటున్నారు. బిగ్ బాస్ పై శివాజీ ఫైర్ అవ్వడం.. దానివలన ఇంట్లో గొడవలు.. శివాజీ బయటకు వెళ్ళిపోతాను అనడం.. ఇదంతా కంటెంట్ కోసం చేయడం బాగానే ఉంది కానీ, ఎదుటివారి బలహీనతలను అడ్డుపెట్టుకొని వారితో గేమ్ ఆడించాలని అనుకోవడం దిగజారిపోవడమని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా.. ఇప్పటివరకు ప్రతి సీజన్ లో కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ అంటే ఒక గౌరవం ఉండేది… బిగ్ బాస్ తో మాట్లాడాలన్నా.. ఏదైనా అనాలన్నా ఒక భయం ఉండేది. ఇప్పుడు ఇలాంటి పనులు చేసి.. బిగ్ బాస్ లేదు.. బొక్కా లేదు అనే మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. తిండి కోసం, వాళ్లకు కావాల్సినదానికోసం పోరాడే బడ్జెట్ టాస్క్ ను త్వరగా పెట్టమని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. వస్తుంది.. ఈ కాఫీ వివాదం ఎప్పుడు ఆగుతుంది అనేది చూడాలి.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!