బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల అఖండ 2 మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. మరోవైపు థియేటర్స్ వద్ద ఫ్లెక్సీలు, కటౌట్ లతో ఎక్కడ చూసిన జై బాలాయ నినాదాలతో హోరెత్తుతున్నాయి. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అటు ట్రేడ్ వర్గాలు కూడా అఖండ 2 ఎలాంటి వసూళ్లు రాబడుతుందో అని ఆసక్తిగా గమనిస్తుంది. అనుకున్నట్టుగానే అఖండ 2 అదరగొడుతుంది. ఇప్పటికే రిలీజ్ రోజుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్స్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. అసలు ప్రీమియర్స్ ఎప్పుడు వేస్తారు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేదానిపై ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
Also Read : Akhanda2 : 24 గంటల్లో బాలయ్య ఊచకోత.. నైజాం ఏరియాలో రికార్డు స్థాయి ఓపెనింగ్
వారి ఎదురుచూపులకు తెరదించుతూ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేసింది. కొద్దీ సేపటి క్రితం అనగా ఉదయం 11 గంటలకు నైజాం ప్రిమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇలా బుకింగ్స్ ఓపెన్ చేయడం ఆలస్యం అలా హౌస్ ఫుల్స్ తో టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. ఇప్పటికే నైజాం మొదటి అడ్వాన్సు బుకింగ్స్ రూ. 5.25 కోట్లు దాటింది. దానికి ప్రీమియర్స్ తోడైతే మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టబోతుంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఇప్పటికే రూ. 16 కోట్లు అడ్వాన్స్ సేల్స్ దాటాయి. ఏదైమైనా బాలయ్య మాస్ సత్తా ఎలా ఉంటుందో అఖండ 2 మరోసారి రుజువు చేస్తోంది. ఇక ప్రీమియర్స్ కి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. బాలయ్య – బోయపాటిలు సంచలన విజయం సాధించి వసూళ్లు సునామి సృష్టిస్తారని కోరుకుందాం.