హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేడు జరగనున్న సమావేశానికి కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ) అందరూ తరలిరావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని ఆయన తెలిపారు. అయితే, ఈ మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ బీఎల్ఏల మీటింగుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కు బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
Read Also: Gold Mine Collapse : మాలిలో కూలిన బంగారు గని.. 70 మందికి పైగా మృతి
ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా బూత్ కన్వీనర్లతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల గెలుపులో బీఎల్ఏలు కీలకపాత్ర పోషించారు.. అలాగే, పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాంటి పని తీరును కనబరిచేందుకు ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచే వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెజారిటీ పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకునే దిశగా క్యాడర్ ను హస్తం పార్టీ రెడీ చేస్తోంది. అలాగే, హామీల అమలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై బీఎల్ఏలకు మల్లికార్జున ఖర్గే సూచనలు చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో 43 వేల మంది కాంగ్రెస్ బీఎల్ఏలు ఈ సమావేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు.