Om Raut: తిరుపతిలో గ్రాండ్‌గా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ప్రొడ్యూసర్లను ఓ కోరిక కోరారు. ఏ వేదిక మీద అయినా రామాయణం కథ జరుగుతున్నా హనుమంతుడు అక్కడికి వచ్చి వీక్షిస్తారని.. తన తల్లి చెప్పినట్లు డైరెక్టర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా నడుస్తున్నప్పుడు ప్రతి థియేటర్‌లో ఒక సీటు ఖాళీగా ఉంచాలని ప్రొడ్యూసర్లను, డిస్ట్రిబ్యూటర్లను డైరెక్టర్ ఓం రౌత్ కోరారు.
Read Also: Kriti Sanon: ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏం కాదు..
హనుమాన్ స్వయంగా అక్కడ ఉన్నట్లు, ఈ ఆదిపురుష్ కథను వీక్షిస్తున్నట్లు భావించాలని, ఆయన ఆశీస్సులుండాలని డైరెక్టర్ ప్రొడ్యూసర్లతో పాటు చిత్రబృందాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్లను, డిస్ట్రిబ్యూటర్లను అడగాలని హీరో ప్రభాస్ డైరెక్టర్‌ను అడగగా.. వెంటనే ఈ విషయంపై ప్రొడ్యూసర్లు స్పందించారు. ప్రతి థియేటర్‌లో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచుతామని మాట ఇచ్చారు. దీంతో అభిమానులంతా కేరింతలు కొట్టారు.
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. ఇక నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ చినజీయార్ స్వామీజీ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ వేదికపై డైరెక్టర్ ఔం రౌత్ మాట్లాడారు.