Kriti Sanon: ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా విషయం తెల్సిందే. ఇక నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ చినజీయార్ స్వామీజీ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ వేదికపై హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ.. నేను నా కెరీర్ ను తెలుగులోనే స్టార్ చేశాను.. ఇప్పటికి తొమ్మిదేళ్లు అవుతుంది. మీ ప్రేమ ఆశీర్వాదం నన్ను ఈ స్టేజివరకు తీసుకొచ్చాయి. ఆదిపురుష్ నాకు చాలా స్పెషల్ సినిమా.. జానకి నాకు ఎంతో ప్రత్యేకమైన పాత్ర. చాలామంది యాక్టర్స్ కెరీర్ లో గుర్తిండిపోయే పాత్రలు వస్తాయి. మీ అందరి ప్రేమ వలన నాకు ఈ పాత్ర వచ్చింది. నేను ఏ సినిమాను ఎంచుకొను.. పాత్రకు నేను సెట్ అవుతాను అంటే వాళ్ళే నన్ను ఎంచుకుంటారు. కానీ, ఈ పాత్ర నాకు రావాలని నేను ఎన్నో సార్లు అనుకున్నాను. ఆ పాత్ర నాకు వచ్చినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.
Chinna Jeeyar Swamy: ప్రభాస్ లోకానికి మహోపకారం చేశాడు..
ఇక ప్రభాస్ గురించి కృతి మాట్లాడుతూ.. ” ప్రభాస్ ఆన్ స్క్రీన్ యాక్టివ్ ఆఫ్ స్క్రీన్ లో చాలా కామ్ అనుకుంటారు. కానీ, ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏం కాదు.. చాలా బాగా మాట్లాడతాడు. చాలా ఫుడ్డి.. అది అందరికి తెలిసిందే. నిజంగా ప్రభాస్ .. డార్లింగ్.. వెరీ స్వీట్ .. ఎంతో కష్టపడతాడు. అయితే అతనిలో ఉన్న ఒక కామ్ నెస్ ఉంటుంది. అది ఎవరిలోనూ నేను చూడలేదు. రాముడిగా ప్రభాస్ ను తప్ప ఎవరిని ఉహించుకోలేం” అని చెప్పుకొచ్చారు.