టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అప్పుడే ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అభిషేక్ 900లకు పైగా రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ర్యాంకుల్లో ఈ ఘనత అందుకున్న మూడవ భారతీయ బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకుల్లో అభిషేక్ నంబర్ 1 స్థానాన్ని నిలుపుకున్నాడు. ప్రస్తుతం అభిషేక్ ఖాతాలో 907 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.
ఇదివరకు టీ20 ర్యాంకుల్లో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే 900లకు పైగా రేటింగ్ పాయింట్లను సాధించారు. గతంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 912తో టీమిండియా తరపున అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధికంగా 909 రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. సూర్య, కోహ్లీలు సుదీర్ఘ కాలం భారత్ తరపున ఆడిన తర్వాత ఈ ఘనత సాధించగా.. అభిషేక్ శర్మ 21 మ్యాచ్‌లలోనే సాధించాడు. సూర్య, కోహ్లీల ఎలైట్ క్లబ్‌లోకి అభిషేక్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ మెరుపు బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read: IND vs WI: పంత్, అయ్యర్ అవుట్.. అభిమన్యు సంగతేంటో?
2025 ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 24 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకున్నాడు. 24 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్‌పై అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. దాంతో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ అయింది. 2012లో అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. ఈ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. భారత్-పాకిస్తాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ పేరిట ఉంది. 23 బంటులోనే హఫీజ్ అర్ధ సెంచరీ బాదాడు.