ప్రస్తుతం యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. మంచి ఫామ్ మీదున్న భారత్ ఫైనల్ చేరడం ఖాయం. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ ముగిసిన నాలుగు రోజులకే.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు నరేంద్ర మోడీ స్టేడియంలో మొదటి టెస్ట్, సెప్టెంబర్ 10-14 మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నేడు భేటీ కానుంది. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును ఈరోజు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా భేటీలో పాల్గొననున్నాడు.
ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కొనసాగనున్నారు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా ఉంటారు. ఫార్మాట్‌కు దూరంగా ఉండాలకున్న శ్రేయస్ అయ్యర్‌కు చోటు లేనట్లే. రిషభ్ పంత్‌కు విశ్రాంతి కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి ధ్రువ్ జురెల్‌ను ఎంపిక లాంఛనమే. నితీశ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ పక్కా. టెస్టు అరంగేట్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తోన్న అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్‌లు ఎంపిక కానున్నారు.
స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లు జట్టులో చోటు దక్కించుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను తీసుకుంటే సుందర్ లేదా అక్షర్లలో ఒకరిపై వేటు పడుతుంది. పేస్ కోటాలో స్టార్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఎంపికవడం ఖాయం. మూడో పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణకు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. మరి బీసీసీఐ సెలెక్టర్లు ఏదైనా షాకింగ్ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: ICC Rankings 2025: ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆటగాళ్ల హవా.. మూడు విభాగాల్లోనూ టాపే!
భారత జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), దేవదుత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.