టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అప్పుడే ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అభిషేక్ 900లకు పైగా రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ర్యాంకుల్లో ఈ ఘనత అందుకున్న మూడవ భారతీయ బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకుల్లో అభిషేక్ నంబర్ 1 స్థానాన్ని నిలుపుకున్నాడు. ప్రస్తుతం అభిషేక్ ఖాతాలో 907 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇదివరకు టీ20 ర్యాంకుల్లో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే 900లకు…