Rajya Sabha Nominations: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ఏఐసీసీ ముఖ్య ప్రతినిధి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి వీరు నామినేషన్ సెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణుల కోలాహలంతో అసెంబ్లీ ప్రాంగణం సందడిగా మారింది. నామినేషన్ అనంతరం అభ్యర్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. తెలంగాణ తరఫున రెండోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు కేసీ వేణుగోపాల్‌లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..
అలాగే వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి స్థానానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ పేరును అధిష్ఠానం ముందే ఖరారు చేయగా, రెండో స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బుధవారం రాత్రి వరకు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం వేం నరేందర్‌రెడ్డి పేరు ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టడం, పార్టీలో అందరితో సానుకూల సంబంధాలు ఉండటంతో నరేందర్‌రెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గు చూపింది.
