తెలంగాణ రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ‘తెలంగాణలో సంక్షేమ పనులు అభివృద్ధిని చూడలేని గత పాలకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. పేదలు తినే ప్రతి బుక్కలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడుతుంది. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 14వ తేదీన 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి పని చేస్తుంది.…
Fire : మహబూబాబాద్ జిల్లా సొమ్లా తండాలో మంగళవారం ఉదయం ఒక దుర్ఘటన భయాందోళన కలిగించింది. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హేలీప్యాడ్ సమీపంలో ఈ ఘటన సంభవించింది. వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. వాహనం పూర్తిగా దగ్ధం కాకముందే…
నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటనకు వెళ్తుంది. సౌత్ కొరియాలోని ముఖ్యమైన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను ఈ బృందం సందర్శించనుంది.