Snake bite: కానిస్టేబుల్‌ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
- కానిస్టేబుల్‌కు కట్ల పాము కాటు..
- ఏఐ సాయంతో ప్రథమ చికిత్స అందించిన సిబ్బంది..
- చివరకు ప్రాణాపాయం నుంచి బయటపడిన పోలీస్ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake bite: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అత్యవసర సమయాల్లో ఎలా ఉపయోగపడుతుందనే దానికి ఈ ఘటనే ఉదాహరణ. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్‌ను పాము కాటేసింది. బిజౌలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పూరన్ సికర్వార్ తన ప్రభుత్వ క్వార్టర్స్‌లో నిద్రిస్తుండగా.. మంచంలో దాక్కున్న విషపూరితమైన కట్లపాము ఆయన చేతిని రెండుసార్లు కాటు వేసింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పాము కాటు తర్వాత సహాయం కోసం గట్టిగా అరవడంతో స్టేషన్ ఇంఛార్జ్ సౌరభ్ శ్రీవాస్తవ, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
మంచంపై ఉన్న పామును గుర్తించిన స్టేషన్ ఇంఛార్జ్ ముందుగా దానిని ఫోటో తీసి, ఏఐ ద్వారా సమాచారం సేకరించారు. ఏఐ ఇచ్చిన సూచనల ప్రకారం ప్రథమ చికిత్స చేశారు. ఏఐ సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్‌ను వెంటనే జయరోగ్య ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పాము ఫోటోను పరిశీలించి, ఫోటో ఆధారంగా కట్ల పాముగా తేల్చి, దాని విషానికి విరుగుడు చికిత్స పాటించారు. చివరకు సికర్వార్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. సిబ్బంది సమయస్పూర్తి, ఏఐ సాయంతో కానిస్టేబుల్ ప్రాణాలు దక్కాయి.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు