NDA vs INDIA bloc: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు కానున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈక్రమంలో సోమవారం ఎన్డీఏ కూటమి తరుఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీ ఉంటుందా, ఉండదా అనే సందేహాలకు చెక్ పెడుతూ మంగళవారం ఇండియా అలయన్స్ తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. దీంతో ఇద్దరు బలమైన ప్రొఫైల్ కలిగిన అభ్యర్థుల…
దేశంలో మరోసారి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 19న అస్సాం, తమిళనాడులో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో రెండు, తమిళనాడులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు రాజ్యసభ అభ్యర్థులు.. రాజ్యసభకు టీడీపీ నుండి ఎంపికైన బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుండి ఎంపికైన ఆర్.కృష్ణయ్య.. ఈ రోజు మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు.
రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆర్.కృష్ణయ్య.. అయితే, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ పార్టీలో ఉన్నా.. తాను బీసీల సంక్షేమం కోసం పని చేస్తాను అని స్పష్టం చేశారు.. అయితే, ఈను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్నే పిలిచి సీటిచ్చారని పేర్కొన్నారు.
Rajyasabha Elections: రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 20న ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లోని 6 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఏపీలోని 3 స్థానాలు ఉన్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యల రాజీనామా ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి.
Congress: 2024 లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. మొత్తం 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఒక్క రాజ్యసభ ఎంపీని గెలిపించుకోలేకపోయింది. బీజేపీ పార్టీకి 25 ఎమ్మెల్యేలు ఉండగా.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతు…
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాల రచ్చ నడుస్తోంది. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ మద్దతుదారులు పాక్ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఇది నిజమని తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీ కావాలనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ ఆరోపణల్ని కొట్టిపారేశారు.
Rajya Sabha Elections: క్రాస్ ఓటింగ్, రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది.
Rajya Sabha Poll: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ బీజేపీకి వరంగా మారింది. హిమాచల్ ప్రదేశ్లోని ఒకే ఒక్క రాజ్యసభ ఎంపీ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. 68 మంది సభ్యులు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉండీ, 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మె్ల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి జైకొట్టారు.
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్తో పాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఏడుగురు సమాజ్వాదీ(ఎస్పీ) ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 అసెంబ్లీ స్థానాల్లో 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఓటమి అంచున…