Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. “మిస్టర్ 10%” అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..
- పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హిందువులపై చేసిన వ్యాఖ్యలు వైరల్.
- పాకిస్థాన్‌లో 3–4% హిందువులను “సహిస్తున్నాం” అని జర్దారీ వ్యాఖ్య.
- జావేద్ అఖ్తర్ “మిస్టర్ 10%” అంటూ జర్దారీపై వ్యంగ్య వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Javed Akhtar: పాకిస్తాన్లో హిందూ మైనారిటీలను ఉద్దేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో జర్దారీ మాట్లాడుతూ.. పాక్ మొత్తం జనాభాలో హిందువులు 3-4శాతం ఉన్నారని, దేశంలోని ముస్లింలు వీరిని ‘‘సహిస్తున్నారు’’ అని అన్నారు. ఇదే కాకుండా భారతీయులపై నోరు పారేసుకున్నారు. భారతీయుల దృక్పథం వేరుగా ఉందని, వారికి తమదైన ఎజెండా ఉందని, వారు అఖండ భారత్‌ను విశ్వసిస్తున్నారని, కానీ మధ్యలో జరిగిన అనేక విసయాలను మర్చిపోయారని జర్దారీ అన్నారు. మేము ముస్లింలం, కానీ 3-4 శాతం హిందూ జనాభాను సహించే మానసికత మాకు ఉందని, వారు మాతో ఉండటానికి ఇష్టపడుతారని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై సినీ గేయరచయిత జావేద్ అఖ్తర్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్లో జర్దారీకి ఉన్న ‘‘మిస్టర్ 10 పర్సెంటేజ్’’ అనే మారుపేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. జావేద్ అఖ్తర్ తన పోస్టులో.. “మిస్టర్ జర్దారీ.. తమ దేశంలో 3–4 శాతం హిందువులను సహిస్తున్నామని అంటున్నారు. 10 శాతం కంటే తక్కువ ఉన్న వారందరి పట్ల మీరు ఎప్పుడూ సున్నితత్వం లేకుండా వ్యవహరించారని అర్థమవుతోంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also Read
గతంలో కూడా జావేద్ అక్తర్ పాక్ తీరుపై బహిరంగంగా విమర్శలు చేశారు. 2025 మేలో ముంబైలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, ఉగ్రవాదులకు తన భూభాగాన్ని సురక్షిత స్థావరంగా ఉపయోగించుకునే అవకాశం ఇస్తోందని ఆరోపించారు.
మిస్టర్ 10% జర్దారీ:
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ గురించి సొంతదేశంలోనే ఒక విమర్శ ఉంది. అంతా అతడిని మిస్టర్ 10%గా పిలుస్తారు. ఏ పని చేయాలన్నా ఆయనకు 10 శాతం కమిషన్ ఇవ్వాల్సిందే అని అక్కడి వారు అనుకుంటారు. అంత అవీనితి చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. భార్య బెనజీర్ భుట్టో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో 10% కమీషన్ తీసుకుంటారనే ఆరోపణలు రావడంతో ఈ పేరు బాగా పాతుకుపోయింది.
తాజావార్తలు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!