Rajya Sabha Nominations: రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha Nominations: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ఏఐసీసీ ముఖ్య ప్రతినిధి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి వీరు నామినేషన్ సెట్లను అందజేశారు.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణుల కోలాహలంతో అసెంబ్లీ ప్రాంగణం సందడిగా మారింది. నామినేషన్ అనంతరం అభ్యర్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. తెలంగాణ తరఫున రెండోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు కేసీ వేణుగోపాల్‌లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..
అలాగే వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి స్థానానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ పేరును అధిష్ఠానం ముందే ఖరారు చేయగా, రెండో స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బుధవారం రాత్రి వరకు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం వేం నరేందర్‌రెడ్డి పేరు ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టడం, పార్టీలో అందరితో సానుకూల సంబంధాలు ఉండటంతో నరేందర్‌రెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గు చూపింది. వేం నరేందర్‌రెడ్డికి MIM పార్టీ మద్దతు ఇచ్చింది.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!