Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే 236 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం ఎదుర్కొంటున్న తీరు చూసి, అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలనే చర్చ మొదలైంది.
అయితే, వైభవ్ భవిష్యత్తు గురించి డివిలియర్స్ ఒక విలువైన సలహా ఇచ్చారు. వైభవ్ కేవలం టీ20లకే పరిమితం కాకుండా వన్డేలు, టెస్ట్ క్రికెట్ కూడా ఆడాలని ఆయన కోరారు. టెస్ట్ క్రికెట్ ఆడటం వల్ల ఆటగాడిగా శారీరకంగా, మానసికగా కొత్త విషయాలు నేర్చుకోవచ్చని డివిలియర్స్ అభిప్రాయపడ్డారు. టెస్ట్ క్రికెట్ అనేది అంత సులభం కాదని, అది ఒక కఠినమైన ప్రయాణమని చెబుతూనే.. వైభవ్ ఆ సవాళ్లను అధిగమించగలడని నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
- IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
- Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
ఒకవేళ ఎవరైనా వైభవ్‌ను కేవలం టీ20 స్పెషలిస్ట్‌గా మాత్రమే ఉండమని చెబితే, అతడి కెరీర్ సుదీర్ఘంగా సాగిపోవచ్చు కానీ, అసలైన క్రికెట్ అనుభవం కోసం అన్ని ఫార్మాట్లు ఆడాలని డివిలియర్స్ సూచించారు. వైభవ్ రికార్డులు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు (30) కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అండర్-19 వన్డేల్లోనూ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా నిలిచాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో (టీ20, వన్డే) వైభవ్ ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో (టెస్ట్ ఫార్మాట్) అతడి సగటు ప్రస్తుతం తక్కువగా ఉంది. అందుకే తన ఆటలోని లోటుపాట్లను సరిదిద్దుకుని సంపూర్ణ ఆటగాడిగా ఎదగాలంటే టెస్ట్ క్రికెట్ ఆడటం ఎంతో అవసరమని డివిలియర్స్ స్పష్టం చేశారు. ఈ 15 ఏళ్ల కుర్రాడు భవిష్యత్తులో భారత జట్టుకు టెస్టుల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలని ఆయన ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
-
PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
-
Maa Inti Bangaram: ఖుషీ అవుతున్న సమంత ఫాన్స్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అప్పుడే!
-
Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!