Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
- ముగింపు దశకు ఐపీఎల్ 2026
- అంతర్జాతీయ సీజన్‌పై బీసీసీఐ దృష్టి
- వచ్చే 7-10 రోజుల్లో బీసీసీఐ కీలక మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Selection for vs Afghanistan Test: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ముగింపు దశకు చేరుకుంటుండగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ సీజన్‌పై దృష్టి పెట్టింది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే అఫ్గానిస్థాన్‌తో భారత్ ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ త్వరలో కీలక సమావేశం కానుందని సమాచారం. ముఖ్యంగా స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ భవిష్యత్తుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. వచ్చే 7-10 రోజుల్లో బీసీసీఐ, సెలక్షన్ కమిటీ మధ్య సమావేశం జరగనుంది. రాబోయే నెలల్లో టీమిండియా రోడ్‌మ్యాప్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాదు ఫాస్ట్ బౌలర్ల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. 2026 ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌ల్లో భారత జట్టు ఎంపికకు పరిశీలనలో ఉన్న పేసర్లకు వర్క్‌లోడ్ పెంచాలని బోర్డు సూచించినట్లు సమాచారం. ఇటీవల ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ వంటి యువ పేసర్లు బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో ఉన్నట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆకిబ్ నబీ కూడా టెస్టు జట్టుకు బలమైన అభ్యర్థిగా మారాడు. రంజీ ట్రోఫీలో ఆకట్టుకునే ప్రదర్శనతో అతడు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అఫ్గానిస్థాన్‌తో ఒకే టెస్టు మ్యాచ్ అయినప్పటికీ.. భారత జట్టును బలహీనపరచాలనే ఆలోచన బీసీసీఐకి ఏమాత్రం లేదని తెలుస్తోంది. అందుకే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌కు ఎంపిక చేయాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం. అయితే గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడని సీనియర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ తప్పకపోవచ్చని తెలుస్తోంది. ‘అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ కాబట్టి టెస్టు జట్టులో రాజీ పడాలనే ఉద్దేశం సెలెక్టర్లకు లేదు. అత్యుత్తమ జట్టునే బరిలోకి దింపాలనుకుంటున్నారు. యువకులను అంత సులభంగా ఛాన్సెస్ ఇవ్వాలనుకోవడం లేదు. సిరాజ్ వర్క్‌లోడ్‌ను బీసీసీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ప్రసిద్ధ్ కృష్ణ ఏప్రిల్ 24 తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఆడలేదు. నితీష్ కుమార్ రెడ్డి కూడా సీమ్ బౌలింగ్ విభాగంలో ఉపయోగపడతాడని భావిస్తున్నారు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
భారత్ వచ్చే తొమ్మిది నెలల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్లో మొత్తం తొమ్మిది టెస్టులు ఆడనుంది. అయితే అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ డబ్ల్యూటీసీ సైకిల్లో భాగం కాదు. అయినప్పటికీ బీసీసీఐ ఈ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకుంటూ బలమైన జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!