PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
- ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
- యూఏఈతో పాటు యూరప్ దేశాల్లో పర్యటన
- ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సహకారంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. మే 15 నుంచి 20 వరకు ఐదు దేశాల్లో మోడీ పర్యటించనున్నారు. యూఏఈతో పాటు యూరప్ దేశాల్లో పర్యటించి కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలు విదేశాంగ శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ వెల్లడించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను మోడీ సందర్శించనున్నారు. మే 15న యూఏఈలో పర్యటించనున్న మోడీ.. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సహకారం, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత్-యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని.. అక్కడ 45 లక్షలకుపైగా భారతీయులు నివసిస్తున్నారని సీబీ జార్జ్ తెలిపారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇక మే 15 నుంచి 17 వరకు నెదర్లాండ్స్‌లో మోడీ పర్యటించనున్నారు. 2017 తర్వాత మోడీకి ఇది రెండో నెదర్లాండ్స్ పర్యటన కానుంది. ఈ సందర్భంగా జరగనున్న మూడో ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో వాణిజ్యం, పెట్టుబడులు, గ్రీన్ టెక్నాలజీ, ఆవిష్కరణలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక స్వీడన్, నార్వే, ఇటలీ పర్యటనలు భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య ఈ ఏడాది తుది రూపు దిద్దుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది.
పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ ప్రధానమంత్రితో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే మహారాజు విల్లెం-అలెగ్జాండర్, మహారాణి మాక్సిమా దంపతులను కూడా కలుస్తారు. అంతేకాకుండా భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. అలాగే నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను కూడా కలుస్తారని సీబీ జార్జ్ పేర్కొన్నారు. మే 17న స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో మోడీ అధికారిక పర్యటన జరపనున్నారు.
#WATCH | Delhi: On the Prime Minister's visit to UAE, Netherlands, Sweden, Norway and Italy, MEA Secretary (West) Sibi George says, "… Prime Minister Narendra Modi will undertake a five‑nation tour from 15–20 May, covering the UAE and four European countries — the Netherlands,… pic.twitter.com/X3DD1owrQe
— ANI (@ANI) May 13, 2026
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!