IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
- కొత్త తరహా మోసాలకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు
- ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం
- 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Tickets Scam: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కొనసాగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఫ్రీ ఐపీఎల్ టికెట్లు, ఉచిత లైవ్ స్ట్రీమింగ్ పేరుతో అభిమానులను లక్ష్యంగా చేసుకుని భారీ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌సెక్ వెల్లడించింది. ఈ మోసాల్లో భాగంగా ఇప్పటికే 600కు పైగా ఫేక్ టికెట్ వెబ్సైట్లు, 400కు పైగా నకిలీ స్ట్రీమింగ్ వెబ్సైట్లు గుర్తించినట్లు ఓ నివేదిక పేర్కొంది.
ఈ ఫేక్ వెబ్సైట్లు ఐపీఎల్ టికెట్ల విక్రయం అంటూ.. వినియోగదారుల నుంచి భారీగా డబ్బులు దోచుకుంటున్నాయి. మరోవైపు ‘ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్’ పేరుతో ప్రజలను ఆకర్షించి.. వారి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ప్రమాదకరమైన మాల్వేర్ను సైబర్ నేరగాళ్లు ఇన్స్టాల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వెబ్సైట్లు చాలా ప్రొఫెషనల్‌గా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. మ్యాచ్ షెడ్యూల్స్, టీమ్ లోగోలు, ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్, కస్టమర్ రివ్యూలు వంటి ఫీచర్లు ఉండటంతో.. ఫేక్ వెబ్సైట్లు అసలైన సైట్లలా కనిపిస్తున్నాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఈ ఫేక్ లింకులు సోషల్ మీడియా పోస్టులు, టెలిగ్రామ్ ఛానెల్స్, ఫోరమ్స్, యాడ్స్ ద్వారా విస్తృతంగా షేర్ అవుతున్నాయి. కొన్నిసార్లు యూజర్ ఏ డివైస్ వాడుతున్నాడో గుర్తించి దానికి అనుగుణంగా వేరువేరు హానికర పేజీలకు రీడైరెక్ట్ చేస్తున్నట్లు క్లౌడ్‌సెక్ నివేదిక వెల్లడించింది. ప్రత్యేకంగా ‘SHub Stealer’ అనే ప్రమాదకర మాల్వేర్ను ఈ నకిలీ స్ట్రీమింగ్ వెబ్సైట్లు ఇన్స్టాల్ చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మాల్వేర్ ఒకసారి డివైస్‌లో ఇన్స్టాల్ అయితే.. యూజర్ల పాస్వర్డ్స్, బ్రౌజర్ డేటా, మెసేజింగ్ యాప్ సెషన్స్, క్రిప్టో వాలెట్.. వంటి సమాచారంను సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది. అంతేకాదు డివైస్‌లో ఉన్న ఫైల్స్‌ను కూడా హ్యాకర్లు సులభంగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు కీలక సూచనలు చేశారు. ఐపీఎల్ టికెట్లు కొనుగోలు చేయాలంటే అధికారిక టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ అంటూ వచ్చే అనుమానాస్పద వెబ్సైట్లను పూర్తిగా దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు. తెలియని ఫైల్స్ డౌన్లోడ్ చేయకూడదని, సోషల్ మీడియా లేదా వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని సూచించారు. ఐపీఎల్ క్రేజ్‌ను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అభిమానులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!