Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chanakya Niti: భారతదేశం ముక్కలు ముక్కలుగా ఉన్న కాలంలో, అఖండ భారతాన్ని కలగన్న ఏకైక వ్యక్తి ఆచార్య చాణక్య. ఆయన కేవలం ఒక గురువు మాత్రమే కాదు.. ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన శిల్పి. నంద వంశాన్ని అంతం చేస్తానని శపథం పూని, చంద్రగుప్త మౌర్యుడిని సింహాసనంపై కూర్చోబెట్టిన ధీశాలి. ఆయన రాసిన చాణక్యనీతి గ్రంథం నాటి నుంచి నేటి వరకు ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. బంధువులు అంటే ప్రేమను పంచేవారు మాత్రమే కాదని.. మన ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కూడా మన చుట్టూనే ఉంటారని చెప్పారు ఆచార్య చాణక్య. “నువ్వు ఎలా ఉన్నావు?” అని వారు అడిగేది మీ మీద ప్రేమతో కాదు.. మీ బలహీనతలను తెలుసుకోవడానికి మాత్రమే అని చెప్పారు. మీ సంపాదన, ఇంటి గొడవలు, వ్యక్తిగత విషయాలనే సమాచారంగా సేకరించి, సమయం చూసి మీపైనే వాటిని ప్రయోగిస్తారు. ఇలాంటి ‘గూఢచారి’ బంధువుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలలో ఆచార్య చాణక్య వేల ఏళ్ల క్రితమే చెప్పారు. అది ఎలాగో ఈస్టోరీలో తెలుసుకుందాం.
ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వెంటనే కోపంతో రియాక్ట్ అవ్వడం అతిపెద్ద తప్పు. కోపాన్ని అణచుకోగలిగిన వాడే అసలైన వీరుడని చాణక్యుడు అంటారు. ఎవరైనా “నీవల్ల ఏమీ కాదు” అన్నప్పుడు.. చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోండి. మీ మౌనం చూసి వారికి పిచ్చెక్కుతుంది. ఎందుకంటే వారి మాటకు మీరు అస్సలు బాధపడలేదని అర్థమైనప్పుడు.. అది వారి ఓటమి అవుతుంది. మీ పతనానికి మీ వ్యక్తిగత సమాచారమే ముడిసరుకు. ఎవరైనా వచ్చి “నీ జీతం ఎంత? ఎంత సంపాదిస్తున్నావు?” అని అడిగితే.. అంకెలు చెప్పకండి. “భగవంతుడి దయ వల్ల అన్నీ బాగానే జరుగుతున్నాయి, అంతా నడుస్తోంది” అని సింపుల్‌గా సమాధానం ఇచ్చి టాపిక్ మార్చేయండి.
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
“నువ్వు ఈ పని చేయలేవు” అని ఎవరైనా అంటే వారితో గొడవ పడకండి. “అవును, బహుశా మీరు చెప్పింది నిజమే కావచ్చు” అని చెప్పండి. గొడవ పడాలని వచ్చిన శత్రువు మీరు అలా అనగానే నీరసపడిపోతాడు. పోరాడకుండానే శత్రువును ఓడించే గొప్ప వ్యూహం ఇది. మీ శాంతిని బలహీనత అనుకునే వారికి “అతి వినయం”తో బుద్ధి చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని కించపరిస్తే.. “నా కళ్లు తెరిపించారు.. మీలాంటి మార్గదర్శి దొరకడం నా అదృష్టం” అని గౌరవంగా చెప్పండి. మీ మాటల వెనుక ఉన్న అసలు అర్థం వారికి అర్థమైనా.. పైకి మాత్రం నోరు మూయక తప్పదు. మీ లక్ష్యాలను పని పూర్తి అయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. ప్రపంచానికి దూరంగా ఉండి కష్టపడండి. మీ విజయం ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు.. అది అందరి నోళ్లు మూయిస్తుంది. శత్రువులకు ఇచ్చే అతిపెద్ద సమాధానం మీ “సక్సెస్” మాత్రమే. ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండకండి. “అతిగా కలిసిన చోట గౌరవం తగ్గుతుంది” అన్నది చాణక్య సూత్రం. ప్రతి ఫోన్ కాల్ వెంటనే ఎత్తకండి, ప్రతి వేడుకకు వెళ్లకండి. మీరు కొంచెం అరుదుగా కనిపిస్తే.. మీ విలువ, గౌరవం ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. బంధువుల ఈర్ష్యను మీ మెదడుపైకి ఎక్కించుకోవద్దు. మీరు చేయాల్సిందల్లా ఒకటే.. మాటలతో కాకుండా మీ కృషితో వారికి సమాధానం ఇవ్వండి.
తాజావార్తలు
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..