Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
- ఆటలో మొదలై.. చరిత్రలో నిలిచిన అన్వేషణ
- కాలు జారి పడడంతో కనిపించిన అపురూప శిలాజం
- ‘ఆస్ట్రలోపిథెకస్ సెడిబా’గా తేలిన అరుదైన జాతి
- మానవ పరిణామ క్రమాన్నే మార్చేసిన చిన్నారి ఆవిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matt Berger Fossil Discovery : తొమ్మిదేళ్ల వయసులో పిల్లలు సాధారణంగా ఆటపాటల్లో మునిగిపోతుంటారు. కానీ మాథ్యూ బెర్గర్ (Matt Berger) అనే బాలుడు మాత్రం ఆ వయసులో తెలియకుండానే మానవజాతికి సంబంధించిన ఒక గొప్ప రహస్యాన్ని ఛేదించాడు. తన పెంపుడు కుక్క వెంట పరుగెడుతూ పొరపాటున కాలు జారి పడిన ఆ బాలుడు, ఏకంగా మానవ పూర్వీకులకు సంబంధించిన సరికొత్త శిలాజాన్ని (Fossil) కనుగొన్నాడు. పదిహేనేళ్ల క్రితం జరిగిన ఈ అద్భుత ఘట్టం, చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
అది 2008వ సంవత్సరం. అప్పట్లో మాథ్యూ బెర్గర్ తండ్రి లీ బెర్గర్ (Lee Berger) ఒక ప్రముఖ పురాజీవ శాస్త్రవేత్త (Paleoanthropologist). ఆ సమయంలో ఆయన తన వృత్తిపరమైన కెరీర్లో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. అదే ఏడాది ఆగస్టు 15న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ సమీపంలో ఉన్న మలాపా గుహల ప్రాంతానికి తన కుమారుడు మాథ్యూని కూడా తీసుకెళ్లారు. మానవ పరిణామ క్రమానికి సంబంధించిన కీలక ఆధారాలు అక్కడ దొరుకుతాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్’ (Cradle of Humankind) అని పిలుస్తారు. గూగుల్ ఎర్త్ సాయంతో గుర్తించిన ఒక ప్రాంతానికి చేరుకున్నాక, తన కొడుకును చూసి “సరే మాట్, ఇక్కడ ఏవైనా శిలాజాలు దొరుకుతాయేమో వెతుకు” అని లీ బెర్గర్ సరదాగా చెప్పారు.
Also Read
- INDA vs PAKA: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
- Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
- Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
తండ్రి మాట విన్న మాథ్యూ తన కుక్కతో కలిసి అటు ఇటు తిరగడం ప్రారంభించాడు. ఆ సమయంలో కుక్క వేగంగా పరుగెత్తడంతో దాని వెంట వెళ్తున్న మాథ్యూ, దారిలో ఉన్న ఒక కర్ర తగిలి కింద పడిపోయాడు. దుమ్ము దులుపుకుంటూ లేస్తున్న క్రమంలో దారి పక్కన ఉన్న ఒక రాయిపై ఏదో ఎముక ముక్క బయటకు పొడుచుకు వచ్చినట్లు అతడు గమనించాడు. వెంటనే తన తండ్రికి ఆ విషయాన్ని తెలియజేశాడు. ఆ ఎముకను పరీక్షించిన లీ బెర్గర్ ఆశ్చర్యపోయారు. అది ఒక హోమినిడ్ (Hominid – మానవ పూర్వీకుల జాతికి చెందిన జీవి) కాలర్ ఎముక అని ఆయన వెంటనే గుర్తించారు.
వారిద్దరూ కలిసి ఆ రాయిని తిరగేసి చూడగా, దాని వెనుక భాగంలో పళ్లతో కూడిన దవడ ఎముక కూడా కనిపించింది. సాధారణంగా ఒకే చోట రెండు వేర్వేరు ఎముకలు దొరకడం అనేది చాలా అరుదు. ఆ తర్వాత జరిగిన తవ్వకాల్లో అది సుమారు 20 లక్షల ఏళ్ల క్రితం నివసించిన ‘ఆస్ట్రలోపిథెకస్ సెడిబా’ (Australopithecus sediba) అనే కొత్త రకం మానవ పూర్వీకుల జాతికి చెందిన శిలాజమని తేలింది. ఆధునిక మానవులకు ఈ జాతి జీవులే ప్రత్యక్ష పూర్వీకులు కావచ్చని కొంతమంది శాస్త్రవేత్తల నమ్మకం. ఒక చిన్నారి ఆసక్తి, కుక్క వెంట పరుగెత్తిన ఆ క్షణం.. చివరికి మానవ పరిణామ క్రమ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.
తాజావార్తలు
-
IND vs NZ: డ్రాగా ముగిసిన తొలి టెస్టు.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ!
-
Gold and Silver Prices: వరుస పతనానికి బ్రేక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
-
Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
-
Sharwanand-Bhogi: ఒత్తిడి, భయం లేవు.. అందర్నీ సంతృప్తిపరుస్తా.. ‘భోగి’పై శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..
ట్రెండింగ్
-
INDA vs PAKA: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!