ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేయలేదు.. అర్హులైన వారికి ఏడాదికి రూ. 15 వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం అమలు సమయంలో ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేశాం.. ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే ఆటో డ్రైవర్ల ఉపాధికి ఇబ్బంది అవుతుందని చర్చించాం.. కేబినెట్ మీటింగ్ లో సీఎం ఆటో డ్రైవర్స్ గురించి హామీ…
కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే తమ మాట నిజం అయ్యిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని.. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం అని కొమియాడారు. కాళేశ్వరం కమిషన్…
Aadi srinivas: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ రాజకీయాల్లో నువ్వా..నేనా.. అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీజేపీ నేత రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు దారుణమని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలన్న విషయంలో బీజేపీకి స్పష్టతే లేదు. బీసీ బిల్లుపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాల్సిందని రఘునందన్ రావుపై విమర్శలు గుప్పించారు. కానీ, ఆయన అది చేయకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం…
కేటీఆర్ అసలు రంగు బయటపడిందని.. కేటీఆర్ ట్విట్టర్ లో కాదు.. జనాల్లోకి రా అని కవిత కూడా చెప్పిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కుటుంబంలో ఉన్న సవాళ్లకు సమాధానం చెప్పుకోలేని కేటీఆర్.. ప్రజలకు ఏం చేస్తాడు? అని ఎద్దేవా చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలిగిపోయిందని తెలిపారు.
Aadi Srinivas: ఈటెల రాజేందర్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈటెల మర్యాదస్తుడు అనుకున్నాం.. కానీ, ఆయనకు మతి తప్పిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే మీ అధిష్టానాన్ని కాక పట్టుకో.. కానీ మా ముఖ్యమంత్రిని బూతులు తిడితే పదవి వస్తుందనుకోవడం నీ అవివేకానికి నిదర్శమని ఆయన అన్నారు. ఇంత కాలం రాజకీయాల్లో ఉండి చివరకు ఈ స్థితికి…
కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆందోళన జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంఛార్జ్ కేకే మహేందర్ స్టేజీ మీద ఉండగానే రసాభాస చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు మాట్లాడుతుండగా పార్టీ నాయకులు అడ్డుకున్నారు.
Aadi Srinivas : వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు ఆయనను స్టేట్మెంట్ కోసం ఈరోజు విచారణకు పిలిపించారు. సీఐడీ డీఎస్పీ ఆయన స్టేట్మెంట్‌ను పూర్తిగా రికార్డ్ చేశారు. ఆది శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరసత్వం లేకపోయినప్పటికీ తప్పుడు పత్రాలను ఉపయోగించి పౌరసత్వం పొందారని ఆరోపించారు. ఈ అంశంపై గత 15 ఏళ్లుగా పోరాటం సాగించిన శ్రీనివాస్, ఇటీవల హైకోర్టు ఇచ్చిన…
Aadi Srinivas : గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. దేశానికి త్యాగాలు చేసిన కుటుంబాన్ని “డూప్లికేట్ గాంధీ కుటుంబం” అంటూ మాట్లాడడం తగదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది. నెహ్రూ జైలు పాలయ్యారు, తన ఆస్తులన్నీ దేశం కోసం ధారపోశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశారు. సోనియా…
Aadi Srinivas : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ బరితెగించి ముందుకు పోతుందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ భవనంలో ప్రెస్ మీట్లో అధికారుల పట్ల వ్యాఖ్యలు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశామని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణ చేస్తున్నారని…