NTV Telugu Site icon

Aadi Srinivas : మీ పాపపు పరిపాలనపై మా సీఎం ప్రక్షాళన చేస్తున్నాడు..

Aadi Srinivas

Aadi Srinivas

Aadi Srinivas : మాజీ మంత్రి హరీష్ రావు పై రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని తప్పయింది మేము రాజన్న కి ఇచ్చిన మాట తప్పాము అని క్షమించు అని ఆడుగుతాడు అనుకున్నామని, సోనియా తెలంగాణ ఇస్తేనే కదా కేసీఆర్ సీఎం అయ్యాడు, మీకు పదవులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీ పాపపు పరిపాలనపై మా సీఎం ప్రక్షాళన చేస్తున్నాడని, రాజన్న ఆలయం ను అభివృద్ది చేస్తనాని మోసం చేసిన మీరు.. నన్ను ఓడకొట్టడానికి 2018 లో కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కి శంకుస్థాపన చేసి నిర్మాణం చేయలేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికయినా మీ మామ కేసీఆర్ తరపున క్షమించు అని అడగాలని, కాళేశ్వరం కూలిపోయింది, ఫోన్ ట్యాపింగ్, గొర్ల, బర్ల స్కామ్ లు… ఈ ఫార్ములా కేసులు ఎవరివి… 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాట్లాడేది అని ఆది శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాలేదని మండిపడ్డారు. ఇవాళ గురుకుల పాఠశాలలో కాస్మోటిస్క్స్ 200 శాతం పెంచామని, 20 ఏళ్ల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది మేము అని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని, 10 ఏళ్ళ పరిపాలన ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు ఆది శ్రీనివాస్‌. దేశంలోనే చరిత్ర, ఏక కలలంలో రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్‌ది అని ఆయన అన్నారు.

Duddilla Sridhar Babu : ప్రజలను రెచ్చగొట్టి కలెక్టర్‌పై దాడి.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం

అంతేకాకుండా..’ప్రగతి భవన్ ను మీరు ప్రగాళభాల కోసం… మేము ప్రజల సమస్యల కోసం… వేదిక గా మార్చాము.. మీరు ప్రమాణం చేసి రాజన్న గుడిని డెవలప్ చేయలేదు.. రంగుల రంగుల బ్రోచర్ల తో కాలం వెళ్లాదిశారు.. రాజన్న ఆలయానికి మేము 50 కోట్లు మంజూరు చేసాం… నేతన్న ల కి బతుకమ్మ చీరాల పెండింగ్ బకాయియులు పెట్టింది ఎవరు.. అక్కడ ఉన్న కాటన్, పాలిష్టర్ పరిశ్రమ లను దూరం చేసింది మీరు కదా… మీరు పెట్టిన బకా్యులు మేము చెల్లించాము.. మేము మాట ఇవ్వకున్న యారన్ డిఫో మంజూరు చేసింది మేము… వేములవాడ క్లస్టర్.. పదేళ్ల లో రాష్ట్రము లో విద్వాంసం చేసారు… రాజన్న కి ఇచ్చిన మాట తప్పారని మిమ్మల్ని గద్దె దిగిపోయారు.. తెలంగాణ లో ఎం కోల్పోయారో అంటే మీ నలుగురు ఉద్యగాలు పోయాయి.. పదవులు పోయాయని ఈర్ష్య తో నే మాట్లాడుతున్నారు.. అసెంబ్లీ, పార్లమెంట్ లో ఓడి పోయారు.. ప్రజా ప్రజల అందిస్తాం… హరీష్ లాంటి వారు వస్తారు పోతారు… 11 మాసల్లో ఎవరు ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రజలు చూడగలరు..’ అని ఆది శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.

PM Modi: కాంగ్రెస్‌కి అవినీతిలో ‘‘పీహెచ్‌డీ’’ ఉంది.. ప్రధాని మోడీ ఫైర్..

Show comments