Panchayat Polls: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 4,231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా కాంగ్రెస్ 2,383 బీఆర్ఎస్ 1,146, బీజేపీ 181, ఇతరులు-455 సీట్లను కైవసం చేసుకున్నారు. మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉండగా.. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. మరోవైపు.. బీజేపీ కంటే ఇతరులకు ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. తొలి విడతలో మొత్తం పోలింగ్ శాతం 84.28 కాగా.. యాదాద్రిలో అత్యధికంగా 92.88 శాతం పోలింగ్…
Harish Rao: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ రైజింగ్‌డే శుభాకాంక్షలు తెలిపారు మజీ మంత్రి హరీష్‌రావు.. ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో మీరు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు.. హోంగార్డుల సేవలను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రూ. 9000 గా ఉన్న వేతనాన్ని, రూ. 27,600 కు పెంచిందన్నారు. ట్రాఫిక్ లో విధులు నిర్వహించే వారికి 30% రిస్క్ అలవెన్స్ ఇచ్చింది. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇచ్చి ఆత్మ గౌరవం…
Harish Rao: తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. నేడు దీక్షా దివస్ పురస్కరించుకొని ఎక్స్ లో పోస్ట్ చేశారు. "'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. 'రానే రాదు, కానే కాదు' అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం…
Telangana Panchayat Elections 2025: అనుకున్నదొక్కటి… అయింది ఒక్కటీ… అన్నట్టుగా మారిందట ఆ వ్యక్తి పరిస్థితి… గ్రామానికి సర్పంచ్ కావాలన్నది అతడి కల.. ఇన్నాళ్లుగా అతనికి వివిధ కారణాలతో ఆ పదవి దక్కలేదు.. ఈసారి ఆ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడంతో.. ఇంతకాలం పెళ్లి చేసుకొని ఆ సీనియర్ బ్యాచిలర్ ఉన్నపళంగా నిశ్ఛితార్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. మహిళా రిజర్వేషన్ కావడంతో పెళ్లి చేసుకుంటే తన భార్యకు అయినా పదవి దక్కుతుందని ఆయన వేసిన…
Bandi Sanjay: బండి సంజయ్‌పై టెన్త్ పేపర్ లీక్ కేసు నమోదైన విషయం తెలిసిందే.. ఈ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును తొలగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. "టెన్త్ పేపర్ లీక్ కేసును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.. చేయని తప్పుకు నన్ను జైలుకు పంపారు.. మానవత్వం మరిచి నాపట్ల, బీజేపీ కార్యకర్తలపట్ల క్రూరంగా వ్యవహరించారు.. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నన్ను రోడ్లపై తిప్పుతూ ఏదో…
Harish Rao: సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం హామీ ఏమైంది? ఇచ్చింది 26 లక్షలే.. ప్రభుత్వం బాకీ పడింది 74 లక్షలు.. ఇది ముఖ్యమంత్రి మాట తప్పడం కాదా? అని ప్రశ్నించారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా ప్రభుత్వం ఇప్పించే నష్టపరిహారంలో చూపించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నిస్సిగ్గుగా "బాధితులకు రూ.…
Supreme Court: తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది.
Telangana Cabinet Meeting: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే, అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.