PM Modi-Putin: భారత్‌లో పర్యటించండి.. పుతిన్‌కి మోడీ ఆహ్వానం..
- వచ్చే ఏడాది భారత్‌కి పుతిన్ రాక..
- ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఇండియాలో పర్యటన..
- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి రానున్న రష్యా అధినేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi-Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించినట్లుగా ఆ దేశం ప్రకటించింది. 2025లో ఈ పర్యటనకు సంబంధించిన తేదీలను నిర్ణయించనున్నట్లుగా క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉసాకోవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పుతిన్, పీఎం మోడీ ఏడాదికి ఒకసారి సమావేశాలు నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ సారి రష్యా వంతు అని భారతదేశంలోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ‘‘మా నాయకులు ఏడాదికి ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ఒప్పందం ఉంది. ఈసారి ఇది మా వంతు’’, ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానాన్ని అందుకున్నాము, మేమే దానిని ఖచ్చితంగా సానుకూలంగా పరిశీలిస్తాము అని ఆయన వెల్లడించారు.
Read Also: IPS officer: విషాదం.. పోస్టింగ్‌కి వెళ్తుండగా యువ ఐపీఎస్ అధికారి మృతి..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
2025 ప్రారంభంలో తేదీలు కనుగొంటామని అన్నారు. 2022లో ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌లో తొలిసారి పర్యటించబోతున్నారు. ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి భారత్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని ఇటీవల రష్యా పర్యటనలో ప్రధాని మోడీ అన్నారు. శాంతి, దౌత్యమార్గాల్లో సమస్యను ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ ఏడాది, రష్యా-భారత్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు జూలైలో మోడీ మాస్కో వెళ్లారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. భారతదేశం-రష్యా సంబంధాలను పెంపొందించడంలో చేసిన కృషికి గానూ ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత జాతీయ పురస్కారం “ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్” కూడా లభించింది. అక్టోబర్ నెలలో బ్రిక్స్ సమావేశంలో కోసం మరోసారి మోడీ రష్యాలోని కజాన్‌కి వెళ్లారు. పుతిన్, మోడీల మధ్య మరోసారి సమావేశం జరిగింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!