Andhra Pradesh Crime News: ఆడవాళ్లు బయటకు వెళ్తే.. ఇంటికి వచ్చేదాకా గ్యారంటే లేకుండా పోతోంది.. ఎక్కడ ఏ కామాంధుడు కాచుకు కూర్చున్నాడో.. ఎవ్వడు ఎలా ప్రవర్తిస్తాడో.. అని అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.. చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు ఇలా తేడా లేకుండా.. వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. బయటకు వెళ్లారంటే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి.. తాజాగా, తిరుపతిలో ఓ మహిళ ఆటో డ్రైవర్ బారి నుంచి తప్పించుకోవడానికి రన్నింగ్‌లో ఉన్న ఆటో నుంచి దూకేసింది..
Read Also: Kishan Reddy: ఇక ఆట మొదలైంది.. తెలంగాణ ప్రజలు చేసే యుద్ధానికి బీజేపీ మద్దతు
తిరుపతిలో.. ఆటో డ్రైవర్ దారి మళ్లించడంతో పాటు, అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో ఓ మహిళ రన్నింగ్ ఆటో నుండి దూకేసింది. గాయాలపాలైన మహిళ దిశ SOS కు కాల్ చేసి జరిగిన సంఘటన గురించి పోలీసులకు వివరించింది. ఈ సంఘటన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూళ్లూరుపేటలో ఓ శుభకార్యానికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. బాలాజీనగర్ కు వెళ్లే దారిలో కాకుండా మరొక రూట్ లో ఆటో ను మళ్లించాడు డ్రైవర్. మహిళకు అనుమానం వచ్చి ఆటో డ్రైవర్ ను అడిగినప్పటికి సమాధానం చెప్పలేదు. డ్రైవర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో మహిళ రన్నింగ్ ఆటో నుండి దూకేసింది. అనంతరం దిశ SOS కు కాల్ చేసి సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు.. తీవ్ర గాయాలైన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ కోసం చుట్టుపక్కల పోలీసులు గాలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ నుండి ఆటో డ్రైవర్ వివరాలను పోలీసులు సేకరించారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ ను కేశవులుగా పోలీసులు గుర్తించారు. తప్పించుకున్న ఆటో డ్రైవర్ కేశవులు పై 366 సెక్షన్ కింద సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేశారు..