Massive Fraud in LIC: ఎల్ఐసీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుంది.. ఎల్ఐసీలో పాలసీ చేస్తే.. తమ సొమ్ము భద్రంగా ఉంటుందని భావిస్తారు.. అయితే, కొందరు ఉద్యోగుల తీరు ఆ సంస్థకు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.. దేశవ్యాప్తంగా విశ్వసనీయతకు మారుపేరైన ఎల్ఐసీలో భారీ మోసం వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా కందుకూరు ఎల్ఐసీ కార్యాలయంలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న పూజల శ్రీనివాసరావు.. నకిలీ డెత్ సర్టిఫికెట్లను ఉపయోగించి కోట్ల రూపాయల బీమా క్లెయిమ్స్ స్వాహా చేసినట్లు…
Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలం బండ వడ్డీపల్లిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీ సమయంలో మణికుమార్ (34), పుష్పరాజ్ (26) అనే…
Kurnool Crime: కర్నూలు జిల్లా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఫ్యాక్షన్.. ఇపుడు ఆ పదం వినిపించడమే అరుదు. అలాంటి సమయంలో ఎమ్మిగనూరు మండలం కాందనాతిలో పాత కక్షలు చెలరేగి ఇద్దరు వేటకొడవళ్లకు బలయ్యారు. ఇంట్లో, పొలం వెళ్లే దారిలో, పొలంలో… ఇలా వెంటాడి వేటాడి హత్య చేశారు. ఏడాది క్రితం జరిగిన హత్యలకు ప్రతీకారమే ఈ హత్యలుగా తేల్చారు.. కందనాతిలో ముగ్గురు అన్నదమ్ముల కుటుంబలపై ప్రత్యర్థులు చెలరేగిపోయారు. పరమేష్ అనే వ్యక్తిని ఇంట్లోనే దారుణంగా నరికి…
Nandyal: నంద్యాల పట్టణంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. రైతు నగర్లో నివాసం ఉంటున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నల్లమల భాస్కరన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నల్లమల భాస్కరన్ స్వస్థలం తమిళనాడు. సుమారు పదిహేనేళ్ల క్రితం నంద్యాలకు వచ్చి వివాహం చేసుకున్న ఆయన రైతు నగర్లో స్థిరపడ్డారు. భాస్కరన్ సీఆర్పీఎఫ్ 42వ బెటాలియన్కు…
SBI Bank Robbery Case: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో గత ఏడాది జూలై 27న జరిగిన ఎస్బిఐ (SBI) బ్యాంక్ దోపిడీ కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కీలకమైన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసి, భారీగా బంగారు నగలు సహా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. పోలీసులు వివరాల ప్రకారం.. గత సంవత్సరం జూలై 27న తూముకుంట వద్ద ఉన్న…
Eluru: ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ప్రేమ వివాహం నేపథ్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుడిని ఇనుప స్తంభానికి కట్టేసి రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండవల్లి మండలం కారు కొల్లు గ్రామానికి చెందిన సాయిచంద్ తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన సాయి దుర్గతో తాను ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నానని చెప్పాడు. సాయి దుర్గ ప్రస్తుతం ముసునూరు మండలం రమణక్కపేటలో పోస్టు ఉమెన్గా విధులు నిర్వహిస్తోంది.…
Tirupati: తిరుపతి జిల్లా వెంకటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య కోసం అత్తింటికి వెళ్లిన అల్లుడిపై మామ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వివరాల ప్రకారం.. పాపన హరిప్రసాద్ (32), లక్ష్మీ మౌనిక దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య లక్ష్మీ మౌనిక అలిగి పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో భార్య, పిల్లలను తీసుకెళ్లేందుకు హరిప్రసాద్ శుక్రవారం అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మాటా మాటా పెరిగింది.…
Mango Bay Resorts Club: ఏలూరు జిల్లాలో మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్ లో పోలీసుల సోదాల్లో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. తమకు అనుమతి ఉందని మ్యాంగ్ క్లబ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టు గుర్తించారు.
ASI Son Gang Case: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఎస్ఐ వెంకట నాయుడు కుమారుడి గ్యాంగ్ కార్ల వ్యవహారంలో మరో కేసు నమోదు అయ్యింది. నర్సరావుపేట చోళ మండలం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ భరత్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Vijayawada Horror: విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మందు తాగేందుకు కేవలం రూ.10 ఇవ్వలేదన్న కారణంతో ఓ వృద్ధుడిని మైనర్ బాలుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టీనగర్ లౌక్య బార్ సమీపంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. మైనర్ బాలుడు ప్రసాద్ మద్యం మత్తులో మందు కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతో అక్కడే ఉన్న వృద్ధుడు బుల్…