ఏపీలో మరో బస్సు ప్రమాదం తప్పింది. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి (మం) బోర్నగూడెం వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. వంతెన పై నుంచి వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే.. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వంతెన నుంచి దూసుకెళ్లిన బస్సు గాల్లో వేలాడుతూ ఉంది. అయితే.. ప్రమాదానికి గల కారణం.. వర్షమనే చెబుతున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. బస్సు అదుపుతప్పి దూసుకెళ్లిందంటున్నారు. రాజమండ్రి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నర్సీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.