Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu Naidu Over Punganur Issue: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా విరుచుకుపడ్డారు. వాలంటీర్లపై బురద చల్లడానికే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పుంగనూరులో అక్రమ కేసులనేవి లేవని.. పోలీసులు పెట్టే కేసులకు, తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. పుంగనూరు ఘటనలో దాదాపు 50 మందికి తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. కొట్టండ్రా, తరమండ్రా అంటూ చంద్రబాబే రెచ్చగొట్టారని చెప్పారు. అనుమతి తీసుకోకుండా పుంగనూరుకు వచ్చి, టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చూస్తుంటే.. ఒకే స్కూల్ నుంచి వచ్చినట్లు అర్థం అవుతోందని దుయ్యబట్టారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని వెల్లడించారు.
Nama Nageswara Rao: పార్లమెంట్ చర్చలో మా సక్సెస్.. కేంద్రం ఫెయిల్యూర్ పై మాట్లాడుతాం
నిజానికి పుంగనూరు ఘటనలో చంద్రబాబును మొదటి ముద్దాయిగా పెట్టాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఇంగితజ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు తన హయాంలో ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో పెట్టించారన్నారు. ప్రజాబలం ఉండే నాయకుడిని చంద్రబాబు ఎదుర్కోలేడని ఎద్దేవా చేశఆరు. విద్యుత్ రేట్ల విషయంలో ప్రభుత్వ పాత్ర ఉండదని, విద్యుత్ రెగ్యులేటరీ బోర్డు చూసుకుంటుందని చెప్పారు. చంద్రబాబు హయాంలో కూడా ట్రూ అప్, ట్రూ డౌన్ ఛార్జీలు ఉన్నాయన్నారు. చంద్రబాబు బషీర్‌బాగ్‌లో ఎందుకు కాల్పులు చేయించారని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలన్నీ ఎందుకు ధర్నాలు చేశాయని నిలదీశారు. నాది బంగారం, మీదైతే మట్టి అనే తీరు చంద్రబాబుదని విమర్శించారు. కొవిడ్ సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కుంటే.. ఇంటింటికీ తిరిగి సేవ చేసింది వాలంటీర్లేనని అన్నారు.
No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై చర్చ.. రాహుల్ గాంధీ ప్రసంగం ఉత్కంఠ