Kawasaki Ninja 650: కవాసకి తన అత్యాధునిక మోడల్ 2024 నింజా 650 బైక్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.16 లక్షలుగా ఉంచబడింది. ఇది పాత మోడల్ కంటే కొంచెం ఖరీదైనది. దీని ధర రూ. 7.12 లక్షలు, ఎక్స్-షోరూమ్. ఈ స్పోర్ట్స్ బైక్ ఇప్పుడు సరికొత్త OBD2తో కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది.
డిజైన్
2024 కవాసకి నింజా 650 డిజైన్‌లో పెద్దగా మార్పు లేదు. ఇది మునుపటిలానే ఉంది. ఇది పూర్తిగా ఫెయిర్డ్ స్టైలింగ్, ముందు వైపున ట్విన్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ ఆప్రాన్ పైన విండ్‌షీల్డ్, ఫ్లోటింగ్ టెయిల్ సెక్షన్‌తో కూడిన స్టెప్-అప్ సీట్, అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్‌ను పొందుతుంది. ఇందులో రేసింగ్ టీమ్ గ్రాఫిక్స్‌తో కూడిన సింగిల్ లైమ్ గ్రీన్ పెయింట్ స్కీమ్ మాత్రమే మార్చబడింది.
Read Also:Peddireddy Ramachandra Reddy: వాలంటీర్లపై బురద చల్లడానికే చంద్రబాబు ఆరోపణలు
ఫీచర్స్
కవాసకి నింజా 650లో కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. కవాసకి రైడియాలజీ అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్నాయి.
హార్డ్వేర్, ఇంజిన్
నింజా 650 ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై రూపొందించబడింది. 41 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ , వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్‌ను పొందింది. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్ నియంత్రణలు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, 120/70-సెక్షన్ ఫ్రంట్, 160/60-సెక్షన్ వెనుక ట్యూబ్‌లెస్ టైర్‌లతో బ్రేకింగ్ డ్యూయల్ ఛానెల్ ABS రూపొందించారు.
Read Also:World Cup 2023: జట్టులో నేను లేను.. వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను చూడొద్దనుకున్నా: రోహిత్ శర్మ
నింజా 650లో పవర్ కోసం, అదే 649cc, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఇవ్వబడింది. ఇది ఇప్పుడు E20కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడింది. ఈ ఇంజన్ 8,000rpm వద్ద 67.3bhp పవర్, 6,700rpm వద్ద 64Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఈ బైక్ ట్రయంఫ్ ట్రైడెంట్ 660తో పోటీపడుతుంది. దీనిలో 660cc లిక్విడ్ కూల్డ్ BS6 ఇంజన్ 80bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.25 లక్షల నుండి ప్రారంభమవుతుంది.