టెర్రస్ పై నిద్రిస్తున్న 6ఏళ్ల బాలుడిని చిరుత ఎత్తుకెళ్లింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టంలోని అభయారణ్యం పరిధిలోని ధర్మాపూర్ పరిధిలోని జలీహ తేప్రా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. అప్పటికే చిన్నారి మరణించాడు. ధర్మాపూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రత్నేష్ శ్రీవాస్తవ కథనం ప్రకారం.. బుధవారం రాత్రి అభయారణ్యం పరిధిలోని ధర్మాపూర్ పరిధిలోని జలీహ తేప్రా గ్రామంలో ఇంటి టెర్రస్‌పై వాహిద్(6) దోమతెర బిగించి నిద్రిస్తున్నాడు. రాత్రి 1.30 గంటల సమయంలో చిరుతపులి ఇంటి పైకప్పుపైకి చేరుకుని దోమతెరలోని చిన్నారిని తీసుకెళ్లింది.
Read more: Kuwait: కువైట్ అగ్ని ప్రమాద ఘటన.. మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు సిద్ధం
తల్లిదండ్రులు గమనించి గట్టిగా కేకలు వేశారు. విషయం తెలుసుకున్న గ్రామంలోని ప్రజలు శబ్దం చేస్తూ చిరుతపులిని వెంబడించారు. దీంతో భయపడిన చిరుత చిరుత రక్తం కారుతున్న చిన్నారిని వదిలేసి అడవిలోకి వెళ్లింది. సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఫారెస్ట్ గార్డు అక్కడికి చేరుకున్నారు. చిన్నారిని ప్రైవేట్ వాహనంలో మిహిన్‌పూర్వాలోని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10వేలు అందించారు. ప్రభుత్వం అనుమతించిన రూ.5 లక్షల సాయం అందించేందుకు ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సుమారు రెండు నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఓ బాలికను చిరుత తీసుకువెళ్లడం గమనార్హం. బాలికను కూడా రక్షించలేకపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. గ్రామంలోని జనాలు భయాందోళనలకు గురవుతున్నారు.