Jasprit Bumrah Junior: టీమిండియా వజ్రాయుధం స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుట బ్యాటర్ ఎవరైనా సరే.. అతడి బౌలింగ్ కి భయపడాల్సిన పరిస్థితి. ఇకపోతే బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం ఎంత కష్టమో.. అతని బౌలింగ్ యాక్షన్ అనుకరించడం కూడా అంతే కష్టం. దీనికి కారణం బుమ్రా చాలా తక్కువ దూరంతో పరుగెత్తి కావాల్సిన చోట పర్ఫెక్ట్ డెలివరీ చేయడం అతని బౌలింగ్ యాక్షన్ చాలా వెరైటీగా ఉంటుంది. అయితే తాజాగా ఓ పదేళ్ల లోపు ఉండే ఓ కుర్రోడు అచ్చం బుమ్రా ఎలా చేస్తాడో అతన్ని అనుకరిస్తూ.. అలాగే బోలింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపడుస్తున్నాడు. ప్రస్తుతం ఆ బౌలింగ్ సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
AP Cabinet Key Decisions: ముగిసిన ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలు ఆమోదం
ఈ వైరల్ వీడియోలో ఆ కుర్రాడు అచ్చుగుద్దినట్లు బుమ్రా బౌలింగ్ ఎలా చేస్తాడో.. అలాగే పరిగెత్తుకుంటూ వచ్చి పక్కా యార్కర్లు వేయడం గమనించవచ్చు. ఎలాంటి నియంత్రణ కోల్పోకుండా అతడు అనుకున్న విధంగా బౌలింగ్ చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇది మన భారత్ లో కాదు. దాయాది దేశం పాకిస్తాన్ లో. ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంటే.. అది కాస్త పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ కంటపడింది. అంతటి దిగ్గజ బౌలర్ ఆ పిల్లోడు బౌలింగ్ కు ఫిదా అయిపోయాడు.
Amartya Sen: అప్పట్లో రాహుల్ గాంధీకి రాజకీయాలు నచ్చేవి కాదు.. నెక్ట్స్ ప్రధాని అతడే..?
ఆ పిల్లాడి బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. ” పిల్లాడి బౌలింగ్ అద్భుతంగా ఉంది. అచ్చం బుమ్రా వలె బౌలింగ్ యాక్షన్ అనుకరిస్తూ.. బంతి పై నియంత్రణతో బౌలింగ్ చేయడం చాలా బాగుందని.. ఇది వీడియో ఆఫ్ ది డే ” అనే క్యాప్షన్ జత చేస్తూ ట్విట్టర్ వేదికన పంచుకున్నాడు. ఇక ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు జూనియర్ బుమ్రా వచ్చేసాడోచ్.. అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఈసారి బుమ్రా ఇండియా నుంచి కాదు పాకిస్తాన్ తరుపున ఆడతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
A young bowler trying to emulate @Jaspritbumrah93's bowling action. The video is viral on social media.pic.twitter.com/XF8J02BSwr
— Faizan Lakhani (@faizanlakhani) July 15, 2024