Crime News: మానవత్వాన్ని మంటగొలిపే ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సిర్మౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 82 ఏళ్ల గిరిజన వృద్ధురాలిపై పక్కింట్లో నివసించే యువకుడు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి అందించిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన రోజు రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా, పక్కింట్లో ఉండే సుగ్గా సాకేత్ అనే యువకుడు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు నులిమాడు. అనంతరం ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపింది.
OTT : భారీ బడ్జెట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 5 OTT సిరీస్‌లు ఇవే!
ఈ ఘటన తర్వాత వృద్ధురాలు తన కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. వారు ఆమెను వెంట తీసుకుని సిర్మౌర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయలేదని, వైద్య పరీక్షలు కూడా చేయలేదని బాధితురాలు ఆరోపించింది. వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుండగా, ఆమె కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్తుంటారని సమాచారం. పోలీసుల నిర్లక్ష్యంతో న్యాయం జరగలేదని భావించిన కుటుంబ సభ్యులు, శనివారం ఆమెను మహిళా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి మళ్లీ ఫిర్యాదు చేశారు.
Nicolas Maduro: వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ ఫోటోను రిలీజ్ చేసిన ట్రంప్..
ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో, మహిళా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ ఘటనపై మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ మాట్లాడుతూ.. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఫలితాలను బట్టి చర్యలను చేపడతామని పేర్కొన్నారు అధికారులు.