ప్రస్తుతం వినోదం అంటే కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా, ఓటీటీ (OTT) పుణ్యమా అని అరచేతిలోకి వచ్చేసింది. 2025లో వరల్డ్ వైడ్ గా కొన్ని వెబ్ సిరీస్‌లు హాలీవుడ్ సినిమాలకు ధీటుగా వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రేక్షకులను విజువల్ వండర్స్‌తో ఆకట్టుకున్నాయి. ఈ లిస్టులో అందరికంటే ముందు నిలిచింది ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ సిరీస్ చివరి సీజన్ కోసం ఏకంగా రూ.4300 కోట్లు ఖర్చు చేయడం విశేషం. దీని తర్వాత ‘స్టార్ వార్స్ అండోర్ సీజన్ 2’ (డిస్నీ హాట్ స్టార్) రూ.2400 కోట్లతో, మరియు యాపిల్ టీవీలో వచ్చిన ‘సెవెరెన్స్ సీజన్ 2’ సుమారు రూ.1800 కోట్ల భారీ బడ్జెట్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచాయి.
Also Read : Amitabh Bachchan : వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్ బచ్చన్..
కేవలం భారీ ఖర్చే కాకుండా, వైవిధ్యమైన కథలతో కూడా ఈ సిరీస్‌లు అలరించాయి. యాపిల్ టీవీలో వచ్చిన సై-ఫై థ్రిల్లర్ ‘ఫ్లూరిబస్’ (బడ్జెట్ రూ.1125 కోట్లు) ఒక వైరస్ ప్రభావం చుట్టూ తిరిగే కథతో హైయెస్ట్ రేటింగ్ సొంతం చేసుకోగా, జియో హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అయిన ‘ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2’ రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో రివెంజ్ డ్రామాగా మెప్పించింది. ఈ ఐదు సిరీస్‌లు కూడా అద్భుతమైన మేకింగ్ వాల్యూస్, యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఓటిటి ప్రియులకు పీక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయనే చెప్పాలి. ఒకవేళ మీరు వీటిని ఇంకా చూడకపోతే, పైన చెప్పిన స్ట్రీమింగ్ యాప్స్‌లో వెంటనే చూసేయండి!