Andhra Pradesh: మోసం చేయడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడుతున్నారు.. అడ్డదారులు తొక్కుతున్నారు.. ఆ నేత తెలుసు.. ఈ ఆఫీసర్ తెలుసు.. అంతెందుకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో కూడా మనకు తెలిసినవారు ఉన్నారంటూ బురిడి కొట్టిస్తున్నారు.. తాజాగా, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ వ్యక్తి తనకు ఏపీ సీఎంవోలో సంబంధాలు ఉన్నాయంటూ నమ్మబలికాడు.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బలహీనతపై కొట్టాడు.. ఏకంగా రూ.54 లక్షలు మోసం చేశాడు.. బాధితుల ఫిర్యాదు మేరకు మోచర్ల మహేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు నందివాడ పోలీసులు.
Read Also: Dalapathi Vijay : సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న విజయ్?
ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువకులను నమ్మించిన మహేష్.. ఉద్యోగం పేరుతో తనకు బంధువులైన తమిరిశ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అతని చెల్లి నుండి డబ్బులు వసూళు చేశాడు.. మరో నలుగురికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నమ్మబలికాడు మహేష్.. దీంతో.. మరో నలుగురిని మహేష్ కి పరిచయం చేశాడు శ్రీకాంత్.. పలు దఫాలుగా మహేష్ కు 54 లక్షల రూపాయలు చెల్లించారు ఆరుగురు బాధితులు.. ఉద్యోగం గురించి అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి తప్పించుకు తిరుగుతున్నాడు.. దీంతో, పోలీసులను ఆశ్రయించారు బాధితులు. మహేష్ పై 420 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు నందివాడ పోలీసులు.