killing 8 year old girl in chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక దాడి, హత్య స్థానికంగా కలకలం రేపాయి. ఎనిమిదేళ్ల చిన్నారిపై 14ఏళ్ల బాలుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. అంతేకాకుండా హత్య చేసిన బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం బాలుడిని విచారిస్తున్నామన్నారు. వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్‌లో డిసెంబర్ 7న ఎనిమిదేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఐదు రోజుల తర్వాత ఆమె నివాసం ఉండే కాలనీ పక్కనే శవాన్ని గుర్తించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారి ఉండే బిల్డింగ్‌లోని పద్నాలుగేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై విపక్షాలు నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ దారుణానికి ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రం నేరాలకు అడ్డాగా మారిందని, ఏ ఒక్కరికి రక్షణ లేకుండా పోయిందని విమర్శలు గుప్పించాయి.