ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి రాయ్‌పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో ఒక టిప్పర్, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో 9 మంది మహిళలు, ఇద్దరు బాలికలు, ఒక టీనేజర్, 6 నెలల శిశువు ఉన్నారు. మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌లోని చటౌడ్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం…
కన్న కొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. కని పెంచిన కొడుకే కేవలం రూ. 200 కోసం కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ విషయం విన్న వారందరూ ఆ కొడుకుపై విరుచుకుపడుతున్నారు. తన వృద్ధ తల్లి ప్రాణాలను తీసిన కొడుకును చూసి అసహ్యించుకుంటున్నారు. కుక్క కొనడానికి రూ.200 ఇవ్వాలని కొడుకు కోరగా.. ఆ తల్లి నిరాకరించిందని అందుకో తన 70 ఏళ్ల తల్లిని కొట్టి చంపాడని పోలీసులు చెబుతున్నారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ బృందాలు రాయ్‌పూర్, భిలాయ్‌లోని బాఘేల్ నివాసంతో పాటు ఓ సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా రైడ్స్ జరుపుతున్నారు. భూపేశ్ బాఘేల్ తో పాటు, సీబీఐ అధికారులు ఆయన సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసానికి కూడా చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో రోడ్డుపై ఒక రష్యన్ అమ్మాయి చేసిన హై డ్రామా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వీఐపీ రోడ్డులో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేగంగా వస్తున్న ఇండిగో కారు యాక్టివాను ఢీకొట్టింది. ఆ స్కూటీపై ముగ్గురు యువకులు ఉన్నారు. కారు ఢీకొన్న తీరు చాలా తీవ్రంగా ఉండటంతో స్కూటర్ నడిపే వ్యక్తి కొన్ని మీటర్ల దూరంలో పడిపోయాడు. మిగతా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని…
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడి ఇల్లు తగులబెట్టి సజీవ దహనం చేసుకున్న షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ దహనానికి ముందు భార్యపై కూడా పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, స్థానికులు సహా నలుగురు గాయపడ్డారు. ఖమ్తరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాన్‌పురి ప్రాంతంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని బి అమరేశ్వర్‌రావుగా గుర్తించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. శనివారం రాయ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్సల్స్ దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రజలకు అభివృద్ధిపై నమ్మకం ఉందన్నారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా నక్సల్స్ సమస్య నుంచి విముక్తి పొందాయని తెలిపారు. నక్సల్స్ దాడులు 54 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని హోంమంత్రి తెలిపారు. 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్నారు. ఎవ్వరినీ వదలమని హెచ్చరించారు. READ MORE: Tragedy:…
Chattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆడి కారు, బంగారు నగలు తదితరాలు లభ్యమయ్యాయి.
Liquor Scam : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రాష్ట్రంలో రూ. 2000 కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రిటైర్డ్ IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అధికారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పెద్ద చర్య తీసుకుంది.