Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం దేవర. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనపడబోతున్నారు. దేవర మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు కొత్త ఏడాది కావడంతో.. దేవర నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి.. ఫ్యాన్స్ కు న్యూయర్ విషెస్ తెలిపారు మేకర్స్. పోస్టర్ లో ఎన్టీఆర్ సముద్రంపై వేటకు బయలుదేరిన సింగంలా పవర్‌ఫుల్ గెటప్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ పోస్టర్ బాలేదని, ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారని సోషల్ మీడియాలో కొన్ని సైట్లు రాసుకొచ్చాయి. ఎన్టీఆర్ లుక్ బాలేదని, ఇంతకన్నా మంచి పోస్టర్ దొరకలేదా.. ? అని ఫ్యాన్స్ అడుగుతున్నట్లు అందులో రాసుకొచ్చారు. అయితే.. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పోస్టర్ బాలేదని మేమెప్పుడూ చెప్పలేదని.. ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. పోస్టర్ బావుందని, తామేమి అసహనం వ్యక్తం చేయలేదని కూడా చెప్పుకొస్తున్నారు. దీంతో సదురు సైట్స్ పై నెటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. మరి దేవర సినిమాతో ఎన్టీఆర్, కొరటాల ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.