అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్‌లకు సంబంధించిన రికార్డు లేదా ప్రపంచ రికార్డు వచ్చినప్పుడల్లా.. రోహిత్ శర్మ, క్రిస్ గేల్, షాహిద్ అఫ్రిదిలే గుర్తుకు వస్తారు. కానీ 2023లో సిక్సర్ రారాజు ఎవరో తెలుసా.. ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఈ ఏడాదిలో సిక్సర్ల సెంచరీని సాధించలేకపోయాడు. UAEకి చెందిన కెప్టెన్ మహమ్మద్ వసీమ్ ఆ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డలకెక్కాడు.…