దేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని విస్తరించేందుకు కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినేట్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (CSS) దశ-3 కింద కొత్త సీట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. క్యాబినేట్ నిర్ణయంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, పీజీ ఇనిస్టిట్యూట్లలో 5,000 పీజీ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెరుగనున్నాయి. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు వరకు ఖర్చు చేయడానికి కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. కొత్త సీట్ల పెంపుతో…
KTR : హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ను ఏసీబీ అధికారులు మూడున్నర గంటలపాటు విచారించారు. ఈ విచారణ సందర్భంగా కేటీఆర్‌ను ప్రశ్నలతో ఏసీబీ అధికారులు నరకాడేశారు. ఆయన సమాధానాలు, సమర్పించిన వివరాలన్నీ అధికారులు శ్రద్ధగా నమోదు చేశారు. ముఖ్యంగా ఆయన పాత్రపై ఇప్పటికే కొన్ని అధికారులు స్టేట్‌మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో విచారణ మరింత ఉత్కంఠతరంగా మారింది. ఏసీబీ అధికారులు…
Formula E-Race Case : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన వెంటనే, ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరంగా కొనసాగించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న గ్రీన్‌కో సంస్థ , దాని అనుబంధ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. తోడుగా, నిందితుల ఇళ్లపై సోదాలు చేపట్టేందుకు కోర్టు నుండి సెర్చ్ వారెంట్‌ను కూడా పొందింది. అయితే.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి…
Waqf board: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు మార్పులు తేవడానికి కొత్తగా బిల్లు తీసుకురావాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మసీదులు, ఇస్లాంలో సంబంధం ఉన్న ఆస్తుల్ని నిర్వహించే వక్ఫ్ బోర్డుల ‘‘అపరిమిత అధికారాలను’’ అరికట్టడానికి కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అనుకుంటోంది.
వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా వార్తలొస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ సమచారం మేరకు.. శుక్రవారమే కేబినెట్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మూకుమ్మడిగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.